ప్రపంచంలో ఈమె చేసిన చీటింగ్‌ మరెవ్వరు చేసి ఉండరు.. చిల్లర షాపింగ్‌కు రూ. 140 కోట్లు ఏంటి భయ్యా?

ప్రపంచంలో రకరకాల వింతైన మోసాలు, విచిత్రమైన ఘోరాలు జరుగుతూ ఉంటాయి.అయితే అందులో కొన్ని మాత్రం అత్యంత విచిత్రంగా అనిపిస్తాయి.

 Zamira Hajiyeva Did Shopping 140 Crores Rupiess With Credit Cards-TeluguStop.com

అరే ఇలా కూడా చేస్తారా అంటూ ఒక నిమిషం ఆలోచిస్తాం.తాజాగా లండన్‌లో వెలుగులోకి వచ్చిన జమీరా హజియేవా అనే మహిళ ఉదంతం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతోంది.

ఆమె చేసిన పనికి అంతా కూడా ముక్కున వేలేసుకుని, ఇంత గొప్ప ఐడియా ఎలా వచ్చింది తల్లి అంటూ ఆమెపై కోపంతోనే పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… జమీరా హజియేవా భర్త ఒక బ్యాంక్‌ ఎంప్లాయి.అతడి సాయంతో జమీరా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 54 క్రెడిట్‌ కార్డులను తీసుకుంది.54 క్రెడిట్‌ కార్డుల్లో అత్యధికంగా భర్త బ్యాంక్‌ నుండి తీసుకున్నవే.క్రెడిట్‌ కార్డ్‌ తీసుకోవడం దాన్ని వాడేసి మరో కొత్త క్రెడిట్‌ కార్డ్‌ను దక్కించుకోవడం.ఇందుకోసం రకరకాల అడ్రస్‌ ఫ్రూప్‌లను ఆమె వినియోగించింది.భార్యకు అన్నేసి క్రెడిట్‌ కార్డులను ఇచ్చినందుకు గాను భర్తకు లండన్‌ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది.ఇక ఆమె గురించిన ఎంక్వౌరీ జరుగుతోంది.

ప్రపంచంలో ఈమె చేసిన చీటింగ్‌ �

జమీరా తాను సంపాదించిన క్రెడిట్‌ కార్డులతో ఏకంగా 140 కోట్ల షాపింగ్‌ చేసింది.అది కూడా డ్రస్‌లు, పిల్లలకు బొమ్మలు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ ఇలాంటి షాపింగ్‌కు ఏకంగా ఆమె 140 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది అంటే ఆమె ఏ స్థాయిలో మోసం చేయాలని నిర్ణయించుకుందో అర్థం చేసుకోవచ్చు.తన నకిలీ క్రెడిట్‌ కార్డుల సాయంతో ఆమె ఒక గోల్ఫ్‌ కోర్టు కొనుగోలు చేసిందంటే ఆమె తెలివికి జై కొట్టాల్సిందే.

ప్రపంచంలో ఈమె చేసిన చీటింగ్‌ �

గత 15 సంవత్సరాలుగా ఎలాంటి ఆదాయ వనరు లేకుండానే ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారు అంటూ ఆమెను ప్రశ్నించిన సమయంలో ఎలాంటి సమాధానం లేదు.ఆమె చేసిన పనికి 10 నుండి 15 ఏళ్లు జైలు జీవితంను అనుభవించాల్సి వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.మరీ ఇంతటి కిలాడీ లేడీని ప్రపంచంలో ఎక్కడ చూసి ఉండం కదా.?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube