జీతాలు ఇవ్వడం లేదని లైవ్ లో వార్తలు చదివే సమయంలో ఆరోపించిన న్యూస్ ప్రజెంటేటర్.. చివరకి..?!

ప్రపంచంలో నాలుగు దిక్కుల ఏమి జరుగుతుందో అనే విషయాలను ఎప్పటికప్పుడు మనకి చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు న్యూస్ రిప్రెజెంట్ చేసేవారు అని అనడంలో అతిశయోక్తి లేదు.ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాలతో పాటు, ప్రజలకు వచ్చిన కష్టాలను కూడా అందరికి తెలియచేసి వారి ఇబ్బందులను తగ్గించే ప్రయత్నం చేసే వాళ్ళు టీవీలో వార్తలు చదివే యాంకర్స్.

 Zambias Kbn News Channel Presenter Alleged That They Are Not Paid Salary In Live-TeluguStop.com

అయితే అందరి ఇబ్బందులను చదివే టీవీ యాంకర్స్ యొక్క ఇబ్బందులను ఎవరు పట్టించుకోవడం లేదు అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.ఒక టీవీ యాంకర్ లైవ్ లో వార్తలు చదువుతున్న సమయంలో ఉన్నటుండి తాను ఎదుర్కుంటున్న ఇబ్బందులు, తాను అనుభవించే బాధలను ప్రజలకు వెళ్ళబుచ్చుకున్నాడు.

పాపం ఆ యాంకర్ ఎన్ని ఇబ్బందులు పడకపోతే ఏకంగా లైవ్ షోలోనే ఇలా తన బాధను వినమని ప్రేక్షకులను అడుగుతాడు చెప్పండి.తరువాత అతను తన సంస్థ తనకు జీతం ఇవ్వలేదంటూ లైవ్ లో చెప్పుకొచ్చాడు.

ఇంతకీ ఈ సంఘటన జాంబియం టీవీ ఛానల్ లో జరిగింది.అక్కడ ఉన్న కేబిఎన్ అనే న్యూస్ ఛానల్ లో టివి న్యూస్ ప్రెజెంటర్ గా కబీండా కాలిమినా అనే వ్యక్తి వార్తలు చదువుతున్నాడు.

వార్తల ముఖ్యాంశాలు చదివిన అనంతరం ఉన్నటుండి టీవీ లైవ్ ను ఆపుచేపించి తరువాత ఎవరూ ఊహించని విధంగా (KBN TV) కెన్మార్క్ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్ పై తీవ్ర ఆరోపణలు చేసాడు.లేడీస్ అండ్ జంటిల్ మన్ మేము కూడా మీలాంటి మనుషులమే.

మాకూ డబ్బుతో అవసరం ఉంటుంది.

ఆ డబ్బులు కోసమే కదా మేము ఉద్యోగం చేసేది.కానీ, దురదృష్టవశాత్తు మాకు కేబీఎన్ న్యూస్ ఛానెల్ వాళ్లు డబ్బులు ఇవ్వడం లేదు.నాకే కాదు.షారన్ తో పాటు ఎవరికీ కూడా డబ్బు చెల్లించలేదు.అంటూ చెప్పుకొచ్చాడు.అయితే ఇది జరిగిన కొద్దిసేపటికి కేబీఎన్ యాజమాన్యం వాళ్ళు అతని చదివిన బులిటిన్ డిలీట్ చేసింది.కానీ న్యూస్ ప్రెజెంటర్ కబీండా కాలిమినా తన ఫేస్ బుక్ లో ఈ వీడియోను షేర్ చేసాడు.

దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.

ఇది చూసిన ప్రజలు న్యూస్ ఛానెల్ టీవీ సిబ్బందికి తమ దైన శైలిలో వారికి అనుకూలంగా కామెంట్లు చేసి కేబీఎన్ యాజమాన్యం వారికీ జీతాలు చెల్లించాలని సూచించారు.

అయితే, ఈ ఫేస్ బుక్ పోస్ట్ పై KBN TV తీవ్రంగా స్పందించింది.కేబీఎన్ టీవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెన్నెడీ మాంబ్వే ఫేస్ బుక్ లో ఒక ప్రకటన చేశారు.

దానిలో KBN TV గా, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో క్లిప్ లో ఉన్న వ్యక్తి ఒక తాగుబోతు.ఆ తాగుబోతు వ్యక్తి యొక్క ప్రవర్తనతో మేము భయపడుతున్నాము.

అతను మా పార్ట్ టైం న్యూస్ ప్రెజెంటర్ లలో ఒకరు అని చెప్పారు.మా ఛానెల్ లో ఉద్యోగం చేసే సిబ్బందికి ఎమన్నా సమస్యలు ఉంటే చెప్పడానికి మా దగ్గర మంచి వ్యవస్థ ఉంది.దాని ద్వారా అతని సమస్య ఏదైనా ఉంటే పరిష్కరించుకుని ఉండాలిసింది.ఇలా అనవసరంగా ఛానెల్ పరువు తీయడం సబబు కాదని తెలిపారు.ఆ నీచమైన ప్రవర్తనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అని చెప్పుకొచ్చారు.ఏది ఏమయినా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube