ప్రతిష్టాత్మక 'స్పెల్లింగ్-బీ 2021' విజేత జైలా అవంత్.. రన్నరప్‌తో సరిపెట్టుకున్న భారతీయ బాలిక

నరాలు తెగే ఉత్కంఠ, వీక్షకులను మునివేళ్లపై నిలబెట్టిన ప్రతిష్టాత్మక ‘‘స్పెల్లింగ్ బీ 2021’’ ఫైనల్‌లో ఆఫ్రికన్ – అమెరికన్ అమ్మాయి జైలా అవంత్ గార్డె (14) విజేతగా నిలిచారు.తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఆఫ్రికన్ అమెరికన్‌గా, ఈ పోటీల చరిత్రలో ఛాంపియన్‌గా నిలిచిన రెండో నల్లజాతీయురాలిగా జైలా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించింది.

 Zaila Avant-garde Becomes First African American To Win Scripps National Spellin-TeluguStop.com

ఈమె కంటే ముందు 1998లో జోడి అన్నీ మ్యాక్స్వెల్ అనే బాలిక స్పెల్లింగ్ బీ కాంటెస్ట్‌లో గెలిచిన తొలి నల్లజాతీయురాలిగా రికార్డుల్లోకెక్కారు.లూసియానా రాష్ట్రంలోని హర్వేకు చెందిన జైలా బాస్కెట్బాల్ క్రీడాకారిణి.

ఆమె పేరిట మూడు గిన్నిస్ బుక్ రికార్డులు కూడా ఉన్నాయి.ఏకకాలంలో ఒకటి కన్నా ఎక్కువ బంతులతో బాస్కెట్బాల్ ఆడినందుకు జైలా గిన్నీస్ బుక్ రికార్డుకెక్కారు.

స్పెల్లింగ్ బీ 2021 ఫైనల్‌లో “murraya,” అనే పదానికి స్పెల్లింగ్ చెప్పాల్సిందిగా జైలాను న్యాయనిర్ణేతలు అడిగారు.ఆ వెంటనే ఆమె ఏ మాత్రం తడబడకుండా సరైన సమాధానాన్ని చెప్పింది.

“murraya,” అంటే ఉష్ణ మండల ఆసియా, ఆస్ట్రేలియన్ జాతికి చెందిన చెట్టు పేరు.తుది రౌండ్‌ మొత్తంలో “nepeta,” అనే పదానికి స్పెల్లింగ్ చెప్పడంలోనే జైలా కాస్త తడబడింది.

Telugu Chaitra Tummala, Jillbiden, Murraya, Nepeta, Bee-Telugu NRI

ఈ పోటీల్లో 11 మంది చిన్నారులు ఫైనల్స్‌కు చేరగా.వీరిలో 9 మంది భారత సంతతి బాలలే వున్న సంగతి తెలిసిందే.ఫైనల్స్‌ ప్రారంభం కావడానికి ముందు ఈ 11 మంది చిన్నారులు, వారి కుటుంబ సభ్యులను అమెరికా ప్రథమ మహిళ జిల్‌బైడెన్ కలిశారు.వృత్తి రీత్యా ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన జిల్ బైడెన్ గతంలో 2009లో జరిగిన స్పెల్లింగ్-బీ ఫైనల్స్‌కు హాజరయ్యారు.1925 నుంచి జరుగుతున్న స్పెల్లింగ్‌-బీ పోటీల్లో గత 20ఏళ్లుగా భారత సంతతి చిన్నారులే ఆధిపత్యం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే.2020లో జరగాల్సిన స్పెల్లింగ్‌ బీ పోటీలు కరోనా ఉద్ధృతి కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.2019లో జరిగిన స్పెల్లింగ్ బీ పోటీల్లో 8 మంది కో ఛాంపియన్లుగా నిలవగా.వారిలో ఏడుగురు భారత సంతతి చిన్నారులే కావడం గమనార్హం.1999 నుంచి జరుగుతున్న ఈ పోటీల్లో ఇప్పటి వరకు 26 మంది ఇండో-అమెరికన్‌ చిన్నారులు ఛాంపియన్లుగా అవతరించారు.

Telugu Chaitra Tummala, Jillbiden, Murraya, Nepeta, Bee-Telugu NRI

స్పెల్లింగ్ బీ 2021లో భారత సంతతికి చెందిన చైత్ర తుమ్మల రన్నరప్తో సరిపెట్టుకున్నారు.జైలా, చైత్ర ఇద్దరూ 2015 ‘స్పెల్లింగ్-బీ’ రన్నరప్ వద్ద శిక్షణ పొందారు.తాజా పోటీల్లో జైలా విజేతగా, చైత్ర రన్నరప్‌గా నిలవడం విశేషం.

ఈ పోటీలో విజేతగా నిలిచినందుకు గాను జైలాకు స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్ సంస్థ 50 వేల డాలర్లు నగదు బహుమతి, మెడల్‌, ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీ బహుకరించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube