తప్పు చేసి తప్పించుకున్నారు... విధి చేతిలో బలైపోయారు  

Zahirabad Rapist Died In Road Accident-disha Act,nirbhaya Act,telangana,zahirabad Rapist

ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసి, హత్యలు చేసేవారి సంఖ్య ఎక్కువైపోతుంది.ఓ వైపు కఠిన చట్టాలు చేసి వాటిని నియంత్రించే ప్రయత్నం చేస్తున్న ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి.

Zahirabad Rapist Died In Road Accident-Disha Act Nirbhaya Telangana

అయితే ఇలాంటి తప్పుడు పనులు చేసినవారు చట్టం నుంచి తప్పించుకున్న విధి నుంచి ఎప్పటికి తప్పించుకోలేరు.చట్టం వారిని ఏమీ చేయలేకపోయిన అన్ని చూస్తున్న ప్రకృతి వారి అంతం కచ్చితంగా చూస్తుంది.

ఇప్పుడు అలాంటి ఘటన తెలంగాణలో జహీరాబాద్ పట్టణంలో జరిగింది.అత్యాచారం చేసి పోలీసుల నుంచి తప్పించుకున్న వారిని విధి వెంటాడింది రోడ్డు ప్రమాదంలో ఒకరి ప్రాణాలు తీసేసింది.


జహీరాబాద్‌ పట్టణంలోని పస్తాపూర్‌ శివారులో పోలీసులమని చెప్పి ముగ్గురు వ్యక్తులు మహిళపై అత్యాచారం చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పవన్ అనే ఒక నిందితుడుని స్పాట్ లోనే పట్టుకున్నారు.

మిగిలిన ఇద్దరు నిందితులైన సోమేశ్వర చారీ, బ్రహ్మచారీ పోలీసుల నుంచి తప్పించుకొని కారులో అల్లాదుర్గం వైపు వెళ్లారు.పోలీసులు వారిని వెంటాడటంతో నిందితులు కారును అతి వేగంగా నడిపారు.

ఈ క్రమంలో రాయికోడ్‌ మండలం మహబత్‌పూర్‌ వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో సోమేశ్వరచారీ అక్కడికక్కడే మృతి చెందగా, బ్రహ్మచారీ తీవ్రంగా గాయపడ్డాడు.

పోలీసులు సోమేశ్వరచారీ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జహీరాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.గాయపడిన బ్రహ్మచారీని చికిత్స నిమిత్తం జహీరాబాద్‌కు తీసుకొచ్చారు.అత్యాచార ఘటన మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే తప్పు చేసి పోలీసుల నుంచి తప్పించుకోవాలని భావించిన విధి చేతి నుంచి తప్పించుకోలేకపోయారని ఈ ఘటన గురించి విన్న అందరూ అంటున్నారు.

.

తాజా వార్తలు