జబర్దస్త్ కంటెస్టెంట్ సోషల్ మీడియా ఖాతా హ్యాక్..!

బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే షో ఏదైనా ఉంది అంటే అందరూ ఇట్లా చెప్పేస్తారు ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో అని.ఈ షో ద్వారా చాలా మంది స్టార్స్ మంచి పాపులారిటీ సొంతం చేసుకొని సినిమాలలో నటించే ఛాన్స్ కూడా కొట్టేస్తున్నారు.

 Jabardast Contestant Social Media Account Hacked, Jabardasth, Ram Prasad, Facebo-TeluguStop.com

ఇలా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న వారిలో జబర్దస్త్ కంటెస్టెంట్ ఆటో రాంప్రసాద్ కూడా ఒకరు.ఈయన బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ పంచు డైలాగులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాడు.

అలాగే రాంప్రసాద్ కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా చాలానే ఉంది.ఇది ఇలా ఉండగా తాజాగా రాంప్రసాద్ కు అనుకోని షాక్ ఎదురయ్యింది.తాజాగా రాంప్రసాద్ ఫేస్బుక్ పేజీని ఎవరో హ్యాక్ చేసినట్లు ఆయనే స్వయంగా తెలియజేశాడు.ఎవరైనా సరే తన ఫేస్బుక్ పేజ్ నుంచి వచ్చే వాటిని పట్టించుకోవద్దు అంటూ ఫ్యాన్స్ కు, ఫాలోవర్స్ కి తెలియచేశాడు .

అలాగే తన ఫేస్బుక్ పేజీ నుంచి అనేక మంది కి మెసేజ్ లు, ఫోన్ నెంబర్లు, ఫోటోలు, పంపాలని అడుగుతున్నట్లు ఆయన దృష్టికి రావడంతో ఇలా తెలియచేయాల్సి వచ్చిందని రాం ప్రసాద్ తెలియజేశాడు.జబర్దస్త్ సుడిగాలి సుధీర్ టీమ్ సభ్యుడిగా ఉన్న ఆటో రాం ప్రసాద్ కు చాలా మంచి పేరు ఉంది.

టీం లీడర్ కాకపోయినప్పటికీ కూడా వారికి ఉన్నత స్థాయిలో క్రేజ్, ఫాలోయర్స్  ను సొంతం చేసుకున్నాడు రాంప్రసాద్.తాజాగా తన ఫేస్బుక్ పేజీ హ్యాక్ కు గురి అయినట్లు రాంప్రసాద్ తెలపడంతో ఆయన ఫ్యాన్స్ , ఫాలోవర్స్ కు షాక్ ఇచ్చే విషయమైపోయింది.

అలాగే తన పేజీని ఫాలో కావడంతోపాటు కేవలం లైక్స్, షేర్స్ మాత్రమే కొట్టాలని రాంప్రసాద్ ఫ్యాన్స్ ను  కోరాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube