మోహన్ బాబు వైవిఎస్ చౌదరి గొడవ ఏంటి! మళ్ళీ లీగల్ నోటీసులు  

మళ్ళీ మోహన్ బాబుకి లీగల్ నోటీసులు పంపించిన వైవిఎస్ చౌదరి. .

Yvs Chowdary Sent Legal Notice To Mohan Babu-manchu Vishnu,tollywood,yvs Chowdary

టాలీవుడ్ లో ఈ మధ్య సంచలనంగా మారిన మరో వ్యవహారం మోహన్ బాబుపై వైవిఎస్ చౌదరి పెట్టిన చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ వారెంట్ రావడం. ఈ అరెస్ట్ వారెంట్ పై బెయిల్ తెచ్చుకున్న మోహన్ బాబు ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళిపోయాడు. దీంతో ఈ వ్యవహారం సైలెంట్ అయిపొయింది..

మోహన్ బాబు వైవిఎస్ చౌదరి గొడవ ఏంటి! మళ్ళీ లీగల్ నోటీసులు -YVS Chowdary Sent Legal Notice To Mohan Babu

అయితే ఊహించని విధంగా మళ్ళీ వైవిఎస్ చౌదరి మోహన్ బాబుకి లీగల్ నోటీసులు పంపించినట్లు తెలుస్తుంది. గతంలో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా, మోహన్ బాబు కీలక పాత్రలో సలీం అనే సినిమాని మంచు లక్ష్మి నిర్మించింది.ఈ సినిమా చేసే సమయంలో తనతో మరో సినిమాకి ఒప్పందం చేసుకొని నలభై లక్షల అడ్వాన్స్ చెక్ రూపంలో ఇచ్చారు.

అయితే సలీం మూవీ ఫ్లాప్ తర్వాత చౌదరితో సినిమాని చేయడానికి మోహన్ బాబు ఇష్టపడలేదు. అయితే అప్పుడు ఇచ్చిన చెక్ బ్యాంకులో వేయడంతో అది కాస్తా బౌన్స్ అయ్యింది. దానిపై వైవిఎస్ చౌదరి కోర్ట్ ని ఆశ్రయించాడు.

దానిలోనే కోర్ట్ మోహన్ బాబుకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ గొడవ అయిపొయింది అనుకుంటే తాజాగా మోహన్ బాబు ఇంటి ఎదురుగా చౌదరి ఓ స్థలం కొన్నాడు. అయితే ఇప్పుడు ఆ స్థలం దగ్గరకి చౌదరిని రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ లీగల్ నోటీసులు జారీ చేసారు.

మరి వీరి గొడవ ఎంత వరకు వెళ్తుందో చూడాలి.