కాలినడకన తిరుమల వెళ్లి టీటీడీ చైర్మన్ గా భాద్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ చైర్మన్ గా వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి భాద్యతలు తీసుకున్నారు.గత ప్రభుత్వ హయాంలో ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ గా తన పదవికి రాజీనామా చేయడం తో ఆ స్థానంలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిని నియమించడం తో ఈ రోజు భాద్యతలు స్వీకరించారు.

 Yv Subbareddy Take Charges As Ttd Chairman1-TeluguStop.com

ఈ రోజు ఉదయం తిరుమలకు కాలినడకన వెళ్లిన ఆయన శ్రీవారి దర్శనానంతరం టీటీడీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ క్రమంలో ఆయనకు తిరుమల ప్రధానార్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ… తిరుమల ప్రతిష్టను పెంచే విధంగా పనిచేస్తామని ఆయన అన్నారు.అలానే స్వామి వారి దర్శనం విషయంలో నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి తోలి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.

అలానే ఇటీవల స్వామి వారి ఆభరణాల విషయంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే వాటిపై కూడా వైవీ స్పందించారు.

ఈ ఆరోపణల పై సమగ్ర విచారణ జరిపి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

-Political

ఇటీవల ఏపీ లో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం తో గతంలో ఉన్న టీటీడీ పాలక మండలి మొత్తం రాజీనామా చేసింది.ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా భాద్యతలు ఇవ్వనున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు.అయితే వైవీ సుబ్బారెడ్డి హిందువు కాదంటూ తెగ వార్తలు గుప్పుమనడం తో వైవీ ఎంపిక పై అనుమానాలు వచ్చాయి.

కానీ వైవీ మాత్రం జగన్ మాటంటే మాటే తప్పకుండా ఆయన నాకు ఆ భాద్యతలు అప్పగిస్తారు అంటూ ధీమా వ్యక్తం చేసారు.అనుకున్నట్లుగానే వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఈ రోజు భాద్యతలు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube