వైవీ పెట్టిన కుంప‌టి.. జ‌గ‌న్‌కు మ‌రో త‌ల‌నొప్పేనా..?

వైసీపీలో కీల‌క నాయ‌కుడిగా ఉన్న సీఎం జ‌గ‌న్ బాబాయి.వైవీ సుబ్బారెడ్డి ఎక్క‌డ ఉన్నా.

 Yv Subbareddy Getting Big Headache For Jagan,yv Subba Reddy, Jagan Mohan Reddy,-TeluguStop.com

వివాద‌మేనా ? ఆయ‌న ఏం చేసినా వివాద‌మేనా ? అంటే.తాజా ప‌రిణామాలు చూస్తున్న వైసీపీ నాయ‌కులు ఔననే అంటున్నారు.

ఆయ‌న గ‌తంలో ఒంగోలు ఎంపీగా ఉన్నారు.ఆ స‌మ‌యంలో పార్టీ అధికారంలో లేదు.

అయినా.ఆయ‌న ప్ర‌శాంతంగా ఉండ‌లేదు.

నిత్యం ఏదో ఒక ర‌గ‌డ‌తో జ‌గ‌న్‌ను క‌లిసేవారు.ఇక‌, త‌ర్వాత ఆయ‌న‌ను టీటీడీ చైర్మ‌న్ గా జ‌గ‌న్ ప్ర‌మోష‌న్ ఇచ్చి.

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరం చేశారు.అయినా కూడా నేనొల్ల‌.

అన్న‌ట్టుగా ఆయ రాజ‌కీయాల్లో వేలు పెడుతూనే ఉన్నారు.ఈ ప‌రిణామాలు.

జ‌గ‌న్ త‌ల‌నొప్పులు తెస్తూనే ఉన్నాయి.

ఇక‌, ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి తీసుకున్న తాజా నిర్ణ‌యం.

మ‌రింత‌గా జ‌గ‌న్ స‌ర్కారుపై నిప్పులు చెరిగేలా చేస్తోంద‌ని పార్టీలోనే చ‌ర్చ వ‌స్తోంది.ఇప్ప‌టికే దేవాలయాల‌పై జ‌రుగుతున్న దాడుల‌తో ప్ర‌భుత్వం ఉక్కిరిబిక్కిరి గుర‌వుతోంది.

వాటికి స‌మాధానం చెప్పుకోలేక‌.కేసులు ప‌రిష్కారం కాక‌.

అన‌వ‌ర‌సంగా ప్ర‌తిప‌క్షాల‌కు ఆయుధంగా మారిపోయామేన‌ని పార్టీ తీవ్ర‌స్థాయిలో మ‌థ‌న‌ప‌డుతోంది.మ‌రి ఈ నేప‌థ్యంలో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నే విష‌యంపై సీఎం జ‌గ‌న్‌కూడా ఆలోచిస్తున్నారు.

ఇంత‌లోనే పులిమీద పిడుగు మాదిరిగా.వైవీ సుబ్బారెడ్డి.

తిరుమ‌ల క్షేత్రంలో కొన్ని ద‌శాబ్దాలుగా ఆన‌వాయితీగా ఉన్న డిక్ల‌రేష‌న్ విధానానికి ముగింపు ప‌లుకుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఎవ‌రైనా.

ఇత‌ర మ‌త‌స్థులు తిరుమ‌ల‌లో శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన‌ప్పుడు.వారి నుంచి తిరుమ‌ల అధికారులు ఓ ఫారంపై సంత‌కం తీసుకుంటారు.

తాము తిరుమ‌ల నియ‌మ‌నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తామ‌ని, ఇక్క‌డ శ్రీవారు ఉన్నార‌నే విష‌యాన్ని న‌మ్ముతామ‌ని, త‌మ‌కు హిందూ మ‌తంపై కూడా విశ్వాసం ఉంద‌ని.స‌ద‌రు ఫాంలో ఉంటుంది.

దీనినే డిక్ల‌రేష‌న్ అంటారు.గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి తిరుమ‌ల‌కు వెళ్లిన‌ప్పుడు కూడా దీనిపై సంత‌కం చేశార‌ని ప్ర‌చారంలో ఉంది.

అలాంటి అత్యంత కీల‌క‌మైన తేనెతుట్టె వంటివిష‌యాన్ని వైవీ తేలిక‌గా తీసుకున్నారు.

అస‌లు డిక్ల‌రేష‌న్ అవ‌స‌రమే లేద‌ని ఎవ‌రైనా వ‌చ్చి శ్రీవారిని ద‌ర్శించుకుని వెళ్ల‌వ‌చ్చ‌ని తాజాగా వైవీ తీసుకున్న నిర్ణ‌యం.

దీనిపై ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంది.ముఖ్యంగా బీజేపీ నేత‌లు దీనిని జాతీయ స్థాయిలో ఉద్య‌మంగా తీసుకువెళ్లాల‌ని కూడా నిర్ణ‌యించ‌డం ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌రింత కాక‌పుట్టిస్తోంద‌ని అంటున్నారు.

ఇలాంటి నిర్ణ‌యాల జోలికి వెళ్ల‌డం స‌మంజ‌సం కాద‌నే అభిప్రాయం సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్య‌క్త‌మ‌వుతోంది.దీంతో ఇప్పుడు కిం క‌ర్త‌వ్యం.? అని అధినేత త‌ల ప‌ట్టుకున్నార‌ని, వెంట‌నే వ‌చ్చి త‌న‌ను క‌ల‌వాల‌ని వైవీని ఆదేశించార‌ని తెలుస్తోంది.మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube