బూమ్రా రికార్డు బ‌ద్ద‌లవ్వ‌డం ఖాయం ? వికెట్ దూరంలో స్పిన్న‌ర్ ?

టీమ్ ఇండియా పేస్ ద‌ళానికి నాయ‌కత్వం వ‌హిస్తున్న స్పిన్న‌ర్ జ‌స్ప్రిత్ బుమ్రా విభిన్న బౌలింగ్ గురించి చెప్ప‌క్క‌ర్లేదు.అన‌తికాలంలోనే స్టార్‌గా అవ‌త‌రించాడు.

 Yuzvendra Chahal Equals Jasprit Bumrah, Jasprit Bumrah, Yuzvendra Chahal ,leg Sp-TeluguStop.com

మూడు ఫార్మ‌ట్ల‌లో టీమిండియాకు కీల‌క బౌల‌ర్‌గా మారాడు.తాజాగా అత‌నికి టెస్టు, టీ 20 జ‌ట్ల వైస్ కేపె్ట‌న్ హోదాను బీసీసీఐ క‌ల్పించింది.

విండీస్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బుమ్రాకు విశ్రాంతి క‌ల్పించింది.దీంతో అటు వ‌న్డే, ఇటు టీ 20కి దూర‌మ‌య్యే ప‌రిస్థితి నెల‌కొంది.

ఇదే అత‌నికి శాపంగా మారింది.బూమ్రా పేరిట ఉన్న ఒక రికార్డును స‌హ‌చ‌ర బౌల‌ర్ ఛేదించేలా ఉన్నాడు.

ఒక్క వికెట్ తీస్తే చాలు బూమ్రా రికార్డు బ‌ద్ద‌ల‌వ్వ‌డం ఖాయమ‌నే చెప్పొచ్చు.

హిట్‌మాన్ రోహిత్ శ‌ర్మ కేప్టెన్సీలో టీం ఇండియా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది.

అయితే ప్ర‌స్తుత టీం ఇండియా స్పిన్న‌ర్ జ‌స్ప్రిత్ బుమ్రా(66 వికెట్లు 55 మ్యాచులు), లెగ్ స్పిన్న‌ర్ చాహ‌ల్‌(66 వికెట్లు 52 మ్యాచ్‌లు) స‌మానంగా ఉన్నారు.బుమ్రా రికార్డును తిర‌గ‌రాసేందుకు చాహ‌ల్ ఒక్క వికెట్ దూరంలోనే ఉన్నాడు.

ఇప్ప‌టికే భార‌త్ త‌ర‌పున అత్యధిక వికెట్లుతీసిన బౌల‌ర్ జాబితాలో బుమ్రాతోపాటు చాహ‌ల్ ఉన్నాడు.అయితే నేడు(ఆదివారం) జ‌రిగే టీ-20 మ్యాచ్‌లో వెస్టిండిస్ బ్యాట‌ర్ల‌లో ఒక‌రిని ఔట్ చేస్తే 67 వికెట్ల‌తో టీ 20 ఫార్మ‌ట్ల‌లో అత్య‌ధిక వికెట్లు తీసినటీమిండియా బౌల‌ర్‌గా చాహ‌ల్ నిలువ‌డం ఖాయం.

అయితే భార‌త ప‌ర్య‌ట‌న‌కువ‌చ్చ‌ని వెస్టిండీస్‌ను వైట్ వాష్ చేసేందుకు రోహిత్ టీం కేవ‌లం గెలుపు దూరంలో మాత్ర‌మే ఉంది.ఇప్ప‌టికే వ‌న్డే సీరీస్‌ను 3-0తో కైవ‌సం చేసుకోగా టీ-20 సీరీస్‌ను కూడా 2-0తో కైవ‌సం చేసుకుంది.

నేడు జ‌రిగే ఆఖ‌రి మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే 3-0తో ఘ‌న‌విజ‌యం సొంతం చేసుకుంటుంది.అయితే ఇప్ప‌టి వ‌ర‌కు వికెట్ దూరంలో ఉన్న చాహ‌ల్ బుమ్రా రికార్డును బ‌ద్ద‌లు కొడ‌తాడా లేదా అన్న‌ది నేటి మ్యాచ్‌తో తేల‌నుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube