కెప్టెన్ గా మారిన చాహల్... ఎలానో తెలుసా...?

ఐపీఎల్ టీమ్స్ లో బాగా ఎంటర్టైన్మెంట్ చేసే టీం ఏది అంటే టక్కున వచ్చే సమాధానం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.ఈ జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకోలేకపోయినా వారి జట్టు అభిమానులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మాత్రం ఎప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందుంటుంది.

 Team Yuzvendra Chahal Beats Team Virat Kohli In Rcb Training Game, Royal Challen-TeluguStop.com

ప్రతిసారి ఐపీఎల్ సీజన్ మొదలయ్యే సమయంలో ‘ ఈ సాల్ ఆల్ కప్ నమ్ దే ‘ అనే స్లోగన్ తో హడావిడి చేసే టీం ఈసారి పెద్దగా సందడి మాత్రం ఎక్కడా కనిపించలేదు.ఇప్పటికే ఐపీఎల్ 2020 సీజన్ కు సంబంధించి టీం జట్టు సభ్యులు యూఏఈ కి చేరుకొని క్వారంటైన్ సమయాన్ని కూడా ముగించుకొని ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు.

ఇక ప్రాక్టీస్ సెషన్ లో మాత్రం టీం సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు తన స్టైల్లో ప్రయత్నాలు చేస్తున్నాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ.ఇకపోతే తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శిబిరంలో ఎలాంటి ప్రాక్టీస్ జరుగుతుందన్న దానిపై వీడియో చిత్రీకరించారు.

ఈ వీడియోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ట్విట్టర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ వీడియోలో భారత జట్టులోని స్పిన్ బౌలర్, అలాగే రాయల్ చాలెంజర్స్ లోని కీలక ఆటగాడు చాహల్ తెగ అల్లరి చేసేసాడు.
ఇకపోతే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శిక్షణ శిబిరంలో తానే కెప్టెన్ అంటూ అందరితోనూ ఆడుకుంటున్న చాహల్.ప్రాక్టీస్ జట్టు లో ఫ్రెండ్లీ గా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లో బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎబి డివిలియర్స్ దగ్గరకు వచ్చి బ్యాటింగ్ పాఠాలు నేర్పడం చూస్తే నిజంగా నవ్వు రాక మానదు.

అయితే మిగిలిన వారికి అర్థం కాకుండా రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్టు సభ్యులందరూ ఒక కోడ్ భాషలో సంభాషిస్తున్నారు.ఈసారి రాయల్ చాలెంజర్స్ ప్రదర్శన విరాట్ కోహ్లీకి కీలకంగా మారనుంది.

దీనికి కారణం గత సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చివరి స్థానంలో నిలబడడమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube