ఆ హీరోయిన్ షాట్‌కు సలాం కొట్టిన యువీ  

Yuvraj Singh Impressed With Saiyami Kher Front Foot Drive-front Foot Shot,saiyami Kher,sports News,yuvraj Singh

భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును సంపాదించుకున్నాడు యువరాజ్ సింగ్.అతడు జట్టులో ఆడిన సమయంలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో స్థానం సొంతం చేసుకున్నాడంటే అతడి ప్రతిభ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

Yuvraj Singh Impressed With Saiyami Kher Front Foot Drive-front Foot Shot,saiyami Kher,sports News,yuvraj Singh Telugu Viral News Yuvraj Singh Impressed With Saiyami Kher Front Foot Drive-front Shot S-Yuvraj Singh Impressed With Saiyami Kher Front Foot Drive-Front Shot Saiyami Sports News

ఇక యువరాజ్ బ్యాటింగ్ చేయడానికి వస్తున్నాడటంటే అప్పట్లో విధ్వంసానికి ఆ స్టేడియం రెడీ అయ్యేది.2007లో జరిగి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ వేసిన ఆరు బంతులను ఆరు సిక్సర్లుగా మలిచి భారత జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా, తన పేరును చిరస్మరణీయం చేసుకున్నాడు.ఇలాంటి ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ నుండి వైదొలిగినా, ఇతర ఆటగాళ్ల ప్రదర్శనతీరుపై అప్పుడప్పుడు స్పందిస్తూ తన అభిమానులను ఆనందింపజేస్తున్నాడు.కాగా తాజాగా ఓ నటి కొట్టిన షాట్‌కు యువీ ఫ్లాట్ అయ్యాడు.

బాలీవుడ్ నటి సయామీ ఖేర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.అందులో ఆమె ఫ్రంట్ ఫుట్ డ్రైవ్ ఆడుతూ ఓ చక్కటి షాట్ కొట్టింది.

ఇది చూసిన యువరాజ్ సింగ్ సయామీని పొగడ్తలతో ముంచెత్తాడు.చాలా అనుభవం ఉన్న క్రీడాకారిణిగా అద్భుతమైన ఫ్రంట్ ఫుట్ డ్రైవ్ ఆడుతున్నావంటూ ఆమెకు రిట్వీట్ చేశాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా వార్తలు

Yuvraj Singh Impressed With Saiyami Kher Front Foot Drive-front Foot Shot,saiyami Kher,sports News,yuvraj Singh Related....