ఉద్వేగం తో మాట్లాడిన యువీ.... అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు  

Yuvraj Singh Announces For His Retirement-

టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినట్లు తెలుస్తుంది.2011 ప్రపంచ కప్ గెలవడం లో కీలక పాత్ర పోషించిన యువీ తన కెరీర్ కు గుడ్ బై పలికాడు.సిక్సర్ వీరుడిగా పేరు పొందిన యువీ ఈ సారి ప్రపంచ కప్ మాత్రం స్థానం దక్కించుకోలేక పోయాడు.అది కూడా యువీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా తెలుస్తుంది...

Yuvraj Singh Announces For His Retirement--Yuvraj Singh Announces For His Retirement-

మంచి ఫామ్ లో ఉన్న యువీ క్యాన్సర్ బారిన పడడం తో అతడి కెరీర్ లో మార్పులు తీసుకువచ్చాయి.

అయితే మహమ్మారి క్యాన్సర్ ని జయించాడు కానీ కెరీర్ మాత్రం తిరిగి తెచ్చుకోవడం లో పూర్తి గా విఫలమయ్యాడు.దీనితో యువీ తన క్రికెట్ కెరీర్ కోసం కష్టపడాల్సి వచ్చింది.

Yuvraj Singh Announces For His Retirement--Yuvraj Singh Announces For His Retirement-

కొద్దీ నెలల క్రితం ఒక ఇంటర్యూ లో మాట్లాడిన యువీ 2019 ప్రపంచ కప్ వరకు క్రికెట్ ను వీడేదేలేదని తేల్చి చెప్పిన అతడు ఇప్పుడు ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు.2012లో చివరిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన యువీ.2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు.ఈ రోజు (సోమవారం) ముంబయి లో మీడియా సమావేశం నిర్వహించిన యువీ తన నిర్ణయాన్ని తెలిపాడు.

క్రికెట్ నాకు ఎంతో ఇచ్చిందన్న యూవీ.చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన ఆటకు దూరం అవుతుండటం ఎంతో బాధగా ఉందని తెలిపాడు.ఇన్ని రోజులుగా తనను ఆదరించిన అభిమానులకు,తన వెన్నంటి నిలిచిన కుటుంబ సభ్యులు, కోచ్, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలంటూ యువీ పేర్కొన్నాడు.అంతేకాకుండా తన జీవితం ఓ రోలర్ కోస్టర్‌లా మారిందంటూ ఉద్వేగంగా మాట్లాడాడు.