బీసీసీఐ నన్ను చాలా అవమానించింది అంటున్న యువరాజ్

క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న తర్వాత చాలా మంది ఆటగాళ్ళు ఇండియన్ క్రికెట్ బోర్డు బీసీసీఐపై తమ అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు.దేశం కోసం ఇంత సేవ చేసిన తమకి బీసీసీఐ సరైన గౌరవం ఇవ్వలేదని, తమని దారుణంగా అవమానించింది అంటూ వాఖ్యలు చేస్తారు.

 Yuvraj On Retirement And Asked Bcci Give Proper Recognition, Indian Cricket, Vv-TeluguStop.com

ఇలా వాఖ్యలు చేసిన వారిలో ఇప్పుడు డాషింగ్ బ్యాట్స్ మెన్ యూవరాజ్ సింగ్కూడా చేరిపోయాడు.సుదీర్ఘ కాలం ఇండియన్ క్రికెట్ టీమ్ కి సేవలు అందించిన యువరాజ్ కెరియర్ ముగింపు మాత్రం చాలా ఘోరంగా జరిగింది.

దేశవాళీలో బాగా రాణిస్తున్న కూడా అవకాశాలు ఇవ్వకపోవడంతోనే అంతర్జాతీయ కెరియర్ కి వీడ్కోలు చెప్పేశాడు.తాజాగా యువరాజ్ ఈ విషయంపై స్పందిస్తూ జాతీయ జట్టు కోసం సర్వశక్తులు ఒడ్డిన ఆటగాళ్లకు సముచిత గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందని స్పష్టం చేశాడు.

సుదీర్ఘకాలం పాటు జాతీయ జట్టుకు సేవలు అందించిన ఆటగాళ్లు రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు బోర్డు అందుకు అనుగుణంగా వ్యవహరించాలని, వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని హితవు పలికారు.

నేనేమీ లెజెండ్ అని భావించడంలేదు.

అయితే దేశం కోసమే క్రికెట్ ఆడాను.నేను టెస్టు క్రికెట్ ఆడింది చాలా తక్కువ.

అయితే ఓ ఆటగాడికి వీడ్కోలు పలకాలని అనుకుంటే దానిపై ఓ ఆటగాడు ఎలా నిర్ణయం తీసుకుంటాడు.బీసీసీఐనే దానిపై నిర్ణయం తీసుకోవాలి.

కానీ నా విషయంలో అలా జరగలేదనే భావిస్తున్నాను.నాకే కాదు, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, సెహ్వాగ్ లకు కూడా సరైన వీడ్కోలు లభించలేదు.

వాళ్లతోనూ ఎంతో దారుణంగా వ్యవహరించారు.గతంలోనూ ఇలాంటివి జరిగాయని తెలియడంతో నాకేమీ పెద్దగా ఆశ్చర్యం కలగడంలేదు.

రెండు వరల్డ్ కప్ లు గెలిచిన గౌతమ్ గంభీర్ కు, టెస్టుల్లో సునీల్ గవాస్కర్ తర్వాత సిసలైన మ్యాచ్ విన్నర్ గా పేరుగాంచిన సెహ్వాగ్ కు సముచిత గౌరవం ఇవ్వాలి.వీవీఎస్ లక్ష్మణ్, జహీర్ లకు కూడా ఆ గౌరవం దక్కాలి అని తెలిపాడు.

కానీ ఎవరి విషయంలో కూడా బీసీసీఐమర్యాదగా వ్యవహరించలేదు.నాతోపాటు వారికి వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వలేదు.

భవిష్యత్తులోనైనా సుదీర్ఘకాలం సేవలందించిన ఆటగాళ్లను సమున్నతరీతిలో గౌరవిస్తారని ఆశిస్తున్నట్టు యువరాజ్ పేర్కొన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube