Nikunj Korat Electric Tractor : రైతుల కోసం యువకుడు వినూత్న ఆవిష్కరణ.. ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌కు రూపకల్పన

ఈరోజుల్లో రైతులకు అయ్యే ఖర్చులు ఎక్కువగా పెరిగిపోయాయి.దీనివల్ల లాభాలు మాట అటు ఉంచితే నష్టాలు పాలవుతున్నారు.

 Yuvaku Innovative Invention For Farmers Design Of Electric Tractor , Electric Tr-TeluguStop.com

అయితే రైతులకు పంట ఖర్చు తగ్గించే ఉద్దేశంతో గుజరాత్‌కి చెందిన నికుంజ్ కోరాట్ అనే కుర్రాడు ఎలక్ట్రిక్ ట్రాక్టర్ తయారు చేశాడు.దీన్ని సహాయంతో కేవలం పది రూపాయల ఖర్చుతో పొలాన్ని దున్నేయొచ్చు.ఈ బుల్లి ట్రాక్టర్‌కు మారుత్ ఈ-ట్రాక్ట్ 3.0గా పేరు పెట్టారు.రైతుగా మారిన ఇంజనీర్ నికుంజ్ కోరట్‌ ఈ ట్రాక్టర్ డెవలప్ చేయడానికి తన సోదరులతో కలిసి రూ.1కోటి పెట్టుబడి పెట్టాడు.మారుత్ ఈ-ట్రాక్ట్ 3.0కు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ సర్టిఫికేషన్ రీసెంట్‌గా లభించింది.

ఇంకా ఈ ఎలక్ట్రిక్ టాక్టర్ మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ కాలేదు.రైతులకు దీనిని రూ.5.5 లక్షల ధరతో అమ్మాలని నికుంజ్ యోచిస్తున్నాడు.వీటిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా తమకు నిధులు సాయం చేయాలని, ఇన్వెస్టర్లు సపోర్ట్ చేయాలని, ఫేమ్ సబ్సిడీ ఇవ్వాలని నికుంజ్ విజ్ఞప్తి చేస్తున్నాడు.మారుత్ ఈ-ట్రాక్ట్ 3.0 4 గంటల్లో ఫుల్ ఛార్జ్‌ అవుతుందట.ఒక్కసారి చార్జ్‌ చేస్తే 8 గంటలపాటు పొలంలో ఈ ట్రాక్టర్ తో పని చేయించవచ్చని నికుంజ్ చెబుతున్నాడు.నిజానికి డీజిల్ ఇంజన్ తో ఇలాంటి బుల్లి ట్రాక్టర్ కొనాలంటే రూ.2.5 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది.కాకపోతే డీజిల్ ఖర్చులు భరించడం చాలా కష్టం.

Telugu Electric, Farm, Nikunj Korat-Latest News - Telugu

దీనికంటే మూడు లక్షలు ఎక్కువగా ఖర్చు చేస్తే సరికొత్త ఎలక్ట్రిక్ ట్రాక్టర్ సొంతం చేసుకోవచ్చు.మెయింటెనెన్స్ ఖర్చు తగ్గించుకొని లాభాలు పొందొచ్చు.మారుత్ ఈ-ట్రాక్ట్ 3.0 తన లైఫ్ టైమ్‌లో 15 వేల గంటలు పని చేస్తుంది.అంటే చాలా సంవత్సరాలు పాటు దీనిని ఉపయోగించవచ్చు.ఆ కాలంలో డీజిల్‌కి బదులుగా గంటకు 10 రూపాయల ఖర్చుతో ఎలక్ట్రిక్ పవర్ ఉపయోగించవచ్చు.మొత్తంగా చూసుకుంటే రైతులు లక్షల రూపాయల్లో ఆదా చేసుకోవచ్చు.ప్రభుత్వం ఏదైనా సబ్సిడీ అందిస్తే ఈ ట్రాక్టర్ ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

దానివల్ల రైతు మరింత డబ్బులు మిగిలించుకునే అవకాశం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube