పిల్లి అనుకుని సాయం చేసిన ఆ పార్టీ లీడర్... తీరా దానిని చూసి పరుగో పరుగు..!

ప్రస్తుత కాలంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కానీ దాన్ని ఎవరో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు.ఆ వీడియో చూడడానికి వింతగా ఉన్నా, ఫన్నీగా ఉన్నా నెటిజన్లు తెగ లైక్స్ కొట్టేస్తున్నారు.

 Ysrtp Party Leader Who Helped Like A Cat Just Look At It And Run-TeluguStop.com

క్షణాల్లో ఆ వీడియో కాస్త తెగ వైరల్ అయిపోతుంది.తాజాగా ఇప్పుడు కూడా ఒక ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

ఒక మూగజీవి తల చెంబులో ఇరుక్కుపోగా ఆ జీవిని చుసిన ఒక వ్యక్తి పిల్లిలా ఉందే అనుకుని పాపం కదా అని కాపాడడానికి ట్రై చేసి ఎలాగోలా చెంబులో నుంచి దాని తలను బయటకు తీస్తాడు.తీరా చెంబులో నుంచి బయటకు వచ్చిన ఆ జీవిని చూడగానే ఆ వ్యక్తి భయపడి పోయి తన కాళ్లకు పని పెట్టాడు.

 Ysrtp Party Leader Who Helped Like A Cat Just Look At It And Run-పిల్లి అనుకుని సాయం చేసిన ఆ పార్టీ లీడర్… తీరా దానిని చూసి పరుగో పరుగు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక్కడే ఉందండోయ్.అసలు ట్విస్ట్.

అది ఏంటంటే అది మూగజీవే.కానీ హాని చేయని మూగజీవి అయితే కాదు.

మనిషి కనిపిస్తే అమాంతం చంపేసి తినేసే హానికరమైన జంతువు.అసలు ఆ జంతువు ఏమయి ఉంటుంది అనుకుంటున్నారు.

ఆ వ్యక్తి మాత్రం చెంబులో తల ఇరుక్కుపోయిన జంతువు పిల్లి అనుకున్నాడు ఆ వ్యక్తి కానీ అది మ్యావ్.మ్యావ్.అనే అరిచే పిల్లి కాదు.అడవిలో అన్ని జంతువులను తన గాండ్రిపుతో భయపెట్టే పులి.

ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది.పిల్లి అనుకుని కాపాడడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరు.? ఏంటి.? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.అయితే ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.వివరాల్లోకి వెళితే.తెలంగాణలోని మొయినా బాడ్ మండలం నక్కపల్లి రోడ్డుమీద చెంబుల్లో తల ఇరుక్కుని రోడ్డుమీద అటు ఇటు పరుగులు పెడుతున్న ఒక మూగజీవిని పని మీద అటు వెళ్తున్న వైఎస్సార్టీపీ ఛీప్ స్పోక్ పర్సన్ కొండా రాఘవ రెడ్డి చూశారు.

Telugu Cat, Helped Tiger, Latest News, Moinabad, Social Media, Tiger, Viral Latest, Viral News, Ysrtp Spokes Person Konda Raghava Reddy-Latest News - Telugu

దానిని చుసిన రాఘవ రెడ్డి అయ్యో చూడడానికి పిల్లిలా ఉందే.పాపం ఆ పిల్లి తలని చెంబులో నుంచి తీసి కాపాడుదాం అనుకుని ఆ మూగజీవిని వెంబడించి ఎలాగయితే పట్టుకుని ఆ పిల్లను చేతుల్లోకి తీసుకుని దాని తలను చెంబులో నుంచి తీసారు.ఆ తరువాత గాని ఆయనకు అర్ధం కాలేదు అది పిల్లి కాదు పులి అని.సాధరణంగా చిన్నప్పుడు పులి పిల్లలు చూడడానికి ఒక్కోసారి పిల్లుల మాదిరిగా ఉంటాయి కదా అలా అనుకునే రాఘవ రెడ్డి కూడా పులి పిల్లను పిల్లి అనుకుని పొరపాటు పడి కాపాడాడు.

అయితే దానిని చూసి వెంటనే భయంతో అక్కడి నుండి వెళ్లిపోయారు.అలాగే ఆ పులి పిల్ల కూడా అక్కడి నుంచి పరుగులు తీసి వెళ్లిపోయింది.ఈ ఫన్నీ ఘటనకు సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

#Tiger #YsrtpPerson #Helped Tiger #Moinabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube