వైఎస్ఆర్‎టీపీ అధినేత్రి షర్మిల కీలక వ్యాఖ్యలు

తెలంగాణ గవర్నర్ తమిళిసైతో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల సమావేశం ముగిసింది.ఈ భేటీ అనంతరం షర్మిల మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Ysrtp Chief Sharmila's Key Comments-TeluguStop.com

ఛలో ప్రగతిభవన్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు, నర్సంపేటలో జరిగిన పరిణామాలపై గవర్నర్ కు షర్మిల ఫిర్యాదు చేశారు.నర్సంపేటలో తమ పాదయాత్రపై టీఆర్ఎస్ నేతలు దాడి చేశారని చెప్పారు.

దాడి చేసిన టీఆర్ఎస్ నేతలను కాకుండా మమ్మల్ని అరెస్ట్ చేశారని తెలిపారు.పాదయాత్రకు వస్తున్న ఆదరణను ఓర్వలేక దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

నర్సంపేటపలో జరిగిన దాడిలో ధ్వంసమైన వాహనాలను కేసీఆర్ కు చూపించే ప్రయత్నం చేశామన్నారు.కానీ బయలుదేరిన కొద్దిసేపటికే తన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారని వెల్లడించారు.

ఎనిమిది గంటలపాటు తనను పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారన్నారు.అంతేకాకుండా తనను రిమాండ్ లో పెట్టాలని పోలీసులు ప్రయత్నించారని ఆరోపించారు.

కేసీఆర్ డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందన్నారు.రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, కాంట్రాక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు.

కల్వకుంట్ల కుటుంబం మాత్రం బంగారు కుటుంబంగా మారిందన్న షర్మిల ప్రగతిభవన్ లో రెయిడ్స్ చేయాలని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube