దగ్గుపాటి పై వైసీపీ రాజకీయం విచిత్రంగా ఉందే ?

తనను నమ్ముకున్నవారి పట్ల వైసీపీ అధినేత జగన్ ఎంత ప్రేమగా ఉంటారో అందరికి తెలిసిందే కానీ కాస్త తేడా వచ్చిందో ఇక వారిని పక్కనపెట్టెయ్యడానికి కూడా అస్సలు వెనకాడడనే విషయం అనేక సందర్భాల్లో బయటపడింది.పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ తనను నమ్ముకున్నవారికి బాగానే ప్రయారిటీ ఇచ్చాడు.

 Ysrcppoliticsisdifferenton Daggipati Venkateswara Rao-TeluguStop.com

ఇక ఇప్పుడు పార్టీలో ఉండి, పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుదనం లేని నాయకులపై దృష్టిపెట్టాడు.ఆ కోవలోనే దగ్గుపాటి వెంకటేశ్వరరావు కు కొన్ని కఠిన నియమాలు విధించినట్టు తెలుస్తోంది.

ప్రస్తతం వెంకటేశ్వరావు వైసీపీలోనే ఉన్నా ఆమె భార్య పురందరేశ్వరి బీజేపీలో ఉన్నారు.దీంతో భార్య, భర్తలు ఇద్దరూ ఒకే పార్టీలో ఉండాలంటూ వైసీపీ అధిష్టానం హెచ్చరికలు జారీ చేసింది.

అసలు చాలా రోజులుగా వైసీపీలో దగ్గుపాటి కి ప్రాధాన్యం తగ్గుతూనే వస్తోంది.

పర్చూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు రావి రామనాథం బాబును వైసీపీలో చేర్చుకున్నారు.

ఇక అప్పటి నుంచి ఆయనకు ప్రాధాన్యం పెంచుతూ దగ్గుపాటి ప్రాధాన్యం తగ్గిస్తూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో దగ్గుపాటి కూడా వైసీపీ అధిష్టానంపై గుర్రుగానే ఉన్నారట.తనకు కనీసం మాట కూడా చెప్పకుండా రావి రామనాథం బాబును పార్టీలో చేర్చుకోవడం, తనకు ప్రాధాన్యత తగ్గించడంతో దగ్గుబాటి తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట.తన రాజకీయ భవిష్యత్ గురించి జగన్ ను కలిసేందుకు ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదట.

కానీ దగ్గుపాటి విషయాన్ని ఆయన సన్నిహితులు జగన్ దృష్టికి తీసుకురాగా పురంధేశ్వరి వైసీపీలో వస్తారా లేక దగ్గుపాటి వెంకటేశ్వరరావు బీజేపీలోకి వెళ్తారా అనే విషయంలో క్లారిటీ ఇవ్వాలని చెప్పినట్టు సమాచారం.ఇద్దరూ చెరో పార్టీలో ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, పురందేశ్వరి వైసీపీలోకి వస్తే ఆమెకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్టు జగన్ స్పష్టం చేసినట్టు సమాచారం.

Telugu Chandrababu, Ys Jagan, Ysrcp-Telugu Political News

  పురందేశ్వరిని వైసీపీ లో చేర్చితేనే ఆమె భర్త వెంకటేశ్వరరావు కు తగిన ప్రాధాన్యం ఉంటుందని, లేకపోతే ఆయన దారి ఆయన చూసుకోవచ్చు అనే విధంగా జగన్ స్పష్టం చేసినట్టు సమాచారం.ఇదే విషయాన్ని ప్రకాశం జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటించారు.ఎన్నికల ముందు నుంచి పురందరేశ్వరి, వెంకటేశ్వరరావు ఇద్దరూ వేరు వేరు పార్టీల్లో ఉన్నారని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు అకస్మాత్తుగా రావడం ఏంటని దగ్గుపాటి వర్గీయులు మండిపడుతున్నారు.ప్రస్తుతం బీజేపీ దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో బీజేపీని వీడేందుకు పురందరేశ్వరి ఒప్పుకోరు.

కాబట్టి వెనకటేశ్వరరావు వైసీపీని వీడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube