జ‌గ‌న్ మాన‌స పుత్రులే వైసీపీ కొంప ముంచేస్తున్నారే...!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి తీసుకువ‌చ్చిన వాలంటీర్ వ్య‌వ‌స్త నిజంగానే ఓ సంచ‌ల‌నం.ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, సంక్షేమ కార్య‌క్ర‌మాలు నేరుగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లేలా జ‌గ‌న్ ఎంతో ఆలోచ‌న‌తో ఈ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చారు.

 The Sons Of Jagan Manasa Are Drowning The Ycp, Ysrcp, Ys.jagan, Volunteers Syst-TeluguStop.com

దీనివ‌ల్ల స్థానికంగా ఉన్న ఎంతో మంది యువ‌త‌కు చిన్న‌దో పెద్ద‌దో ఉద్యోగం అయితే ల‌భించింది.ప్ర‌తి 50 మంది ఇళ్ల‌కు ఓ వాలంటీర్ ఉండ‌డంతో వీళ్లు నేరుగా ఆ 50 మంది ఇళ్ల‌ల్లో ఉన్న వారికి కావాల్సిన ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు స‌మ‌కూరుస్తున్నారు.

దీనివ‌ల్ల సామాన్యుడు ప‌దే ప‌దే అధికారుల చుట్టూ తిరిగే బాధ త‌ప్పింది.దీంతో వీరికి ఎంతో టైం క‌లిసి రావ‌డంతో పార్టీల‌కు అతీతంగా ఈ వ్య‌వ‌స్థ‌ను ప‌లువురు మెచ్చుకున్నారు.

ఇక క‌రోనా స‌మ‌యంలో కూడా వాలంటీర్ ద్వారానే క‌రోనా రోగుల‌ను గుర్తించ‌డం.వారికి స‌కాలంలో వైద్యం అందేలా చేయ‌డం జ‌రిగింది.ఇక ఈ వాలంటీర్ వ్య‌వ‌స్థ‌నే అటు బెంగాల్‌, కేర‌ళ లాంటి రాష్ట్రాలు సైతం అమ‌లు చేయాల‌ని కొద్ది రోజుల క్రితం ఆరా తీశాయి.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వాలంటీర్ వ్య‌వ‌స్థే జ‌గ‌న్‌, వైసీపీ కొంప కొల్లేరు చేస్తోందా ? అంటే అవున‌నే వైసీపీ వ‌ర్గాలు గ‌గ్గోలు పెడుతున్నాయి.జ‌గ‌న్ క్షేత్ర‌స్థాయిలో పార్టీ గెలుపుకోసం క‌ష్ట‌ప‌డిన కార్య‌క‌ర్త‌ల‌తో పాటు ఎంతో మంది సామాన్య జ‌నాలకు వాలంటీర్ వ్య‌వ‌స్థ ద్వారా ఉపాధి ల‌భించినా దీనివ‌ల్ల వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఓట‌ర్లు / ప‌్ర‌జ‌ల‌కు మ‌ధ్య అనుసంధానం ఏర్ప‌డ‌డం లేద‌ట‌.

గ్రామాల్లో ఏ స‌మ‌స్య‌లు ఉన్నా… లేదా ఎవ‌రికి ఏ ప‌ని కావాల‌న్నా గ‌తంలో ప్ర‌జ‌లు లీడ‌ర్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లేవారు.

ఇప్పుడు క‌నీసం చెక్కుల పంపిణీ నుంచి అన్ని ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను వాలంటీర్లే నేరుగా ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు తీసుకు వెళ్తుండ‌డంతో ఇక నాయ‌కులు డ‌మ్మీలు అవుతున్నారు.దీనివ‌ల్ల త‌మ‌కు ఎలాంటి ఉప‌యోగం లేకుండా పోతోంద‌ని కార్య‌క‌ర్తలు, నేత‌లు త‌మలో తామే తీవ్ర మ‌ద‌న ప‌డుతున్నార‌ట‌.

ఇక గ‌తంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాల‌న్నా కూడా ఎమ్మెల్యేల చేతుల మీద‌గానే పంపిణీ చేసేవారు.

Telugu Ys Jagan, Ysrcp-Telugu Political News

ఇప్పుడు వాలంటీర్లే నేరుగా ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వెళ్లి ఇవ్వ‌డంతో ఎమ్మెల్యేల పాత్ర కూడా ఈ విష‌యంలో పూర్తిగా నామ‌మాత్ర‌మ‌వుతోంది. జ‌గ‌న్ ఈ వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను త‌న మాన‌స పుత్రిక‌గా ఎంతో గొప్ప‌గా చెప్పుకున్నారు.దీనివ‌ల్ల ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రుగుతున్నా.

గ్రామ‌స్థాయి నుంచి నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నేత‌ల వ‌ర‌కు అంద‌రూ దీనిపై గుర్రుగానే ఉన్నారు.ప్ర‌జ‌లు వాలంటీర్ల‌కే ప్ర‌యార్టీ ఇస్తూ త‌మ‌ను పట్టించుకోక‌పోతే త‌మ‌కు, పార్టీకి ఏం విలువ ఉంటుంద‌ని వారు వాపోతున్నార‌ట‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube