బీజేపీలో మార్పు మొదలయ్యిందా ? వైసీపీకి ఇబ్బందులు తప్పవా ?  

Ysrcp Will Effect With The Changes In Bjp-changes In Bjp,cm Ys Jagan,janasenas Party,narendra Movie,pawan Kalyan Janasena,tdp,ys Jagan,ysrcp

కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నాయి. ఈ రెండు అధికార పార్టీల ఉమ్మడి శత్రువు ఒక్కడే. ఆయనే టీడీపీ అధినేత చంద్రబాబు..

బీజేపీలో మార్పు మొదలయ్యిందా ? వైసీపీకి ఇబ్బందులు తప్పవా ? -YSRCP Will Effect With The Changes In BJP

చంద్రబాబు ని రాజకీయంగా అణగదొక్కేందుకు ఎన్నికల ముందు నుంచి కలిసికట్టుగా ముందుకు వెళ్లి చంద్రబాబు ఓటమికి కారణం అయ్యారు. ఇప్పటి వరకు అనేక విషయాల్లో ఈ రెండు పార్టీలు ఒకే అభిప్రాయంతో ముందుకు వెళ్లాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించినా పెద్దగా వైసీపీ రియాక్ట్ అవ్వలేదు.

ఇక నిన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి పెద్దగా కేటాయింపులు లేకపోయినా వైసీపీ గట్టిగా విమర్శలు చేయలేకపోయింది. ఇది బీజేపీ విషయంలో వైసీపీ స్టాండ్. అయితే వైసీపీ విషయంలో బీజేపీ మాత్రం ఇప్పుడు వేరేలా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది.

ఎప్పుడూ టీడీపీ మీద విమర్శలు చేస్తూ వైసీపీని వెనకేసుకొచ్చే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం అనేక అనుమానాలు కలిగిస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను జగన్ ప్రభుత్వం కూల్చినప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడారు కన్నా లక్ష్మీనారాయణ. ఇప్పుడు కూడా జగన్ ప్రభుత్వం లో జరుగుతున్న దాడుల గురించి ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్నిఇబ్బందులకు గురిచేస్తున్నాడు. అయితే ఒక్కసారిగా కన్నా రూటు మార్చడం వెనుక రహస్యం ఏంటి అని వైసీపీ ఆలోచనలోనూ, ఆందోళనలోనూ పడింది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ఈ రాష్ట్రంలో కనీస స్థాయిలో బలపడాలన్నా చాలా సమయమే పడుతుంది..

ప్రస్తుతం వైసీపీ అభిమానుల ఆందోళనకు కారణం ఏంటంటే, ఇది కన్నా లక్ష్మీనారాయణ సొంత వైఖరి అయితే పరవాలేదు కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు కూడా ఇదే వైఖరితో ఉంటే పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నారు వైసీపీ నాయకులు. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్థాయి కేసులు ఉన్న ఏ నాయకుడైనా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నట్లే అన్న అభిప్రాయం బలంగా ఉన్న నేపథ్యంలో, వైఎస్సార్ సీపీ అభిమానుల్లో ఆందోళన పెరిగిపోతోంది.

పోనీ బీజేపీ మీద గట్టిగా విమర్శలు చేద్దామంటే ఆ తరువాత తలెత్తే పరిణామాలేంటో జగన్ కు బాగా తెలుసు. అందుకే బీజేపీ విషయంలో ఏ స్టెప్ తీసుకోలేక సతమతం అవుతున్నట్టు కనిపిస్తోంది.