వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ.. బీసీల రేసులో విన్న‌ర్ ఎవ‌రు... !

ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేవు.కానీ, రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీల ప‌రిస్థితి చూస్తే.

 Ysrcp Vs Tdp,who Will Be Winner In Bc Race..?, Ysrcp, Tdp, Bc Caste, Chandra Bab-TeluguStop.com

మాత్రం అప్పుడే ఎన్నిక‌లు వ‌చ్చేశాయా? అనేలా ఉంది.రెండు పార్టీలు కూడా రాష్ట్రంలో కీల‌క‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీ వ‌ర్గాన్ని త‌మ చేరువచేసుకునేందుకు అనేక వ్యూహాల‌తో కాక పుట్టించాయి.

వాస్త‌వానికి వైసీపీ చేసింది ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొన్న విష‌య‌మే అయినా.టీడీపీ మాత్రం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసింది.బీసీల‌కు ప్రాధాన్యం ఇస్తూ.పార్టీలో స‌మూల ప్ర‌క్షాళ‌నకు నాంది ప‌లికింది.ఇక‌, అధికార వైసీపీ ఏకంగా.132 బీసీ కులాల‌కు 56 కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసి.చ‌రిత్ర సృష్టించింది.

వైసీపీ విష‌యాన్ని చూద్దాం.

రాష్ట్రంలోని 132 కులాల‌కు ఏర్పాటు చేసిన‌ కార్పొరేష‌న్ల‌కు స‌గం మంది మ‌హిళ‌ల‌ను చైర్మ‌న్లుగా నియ‌మించింది వైసీపీ.భారీ ఎత్తున డైరెక్ట‌ర్ల‌ను కూడా నియ‌మించింది.

దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఏర్పాటు చేసిన ఈ కార్పొరేష‌న్ల‌తో  ఆయా సామాజిక వ‌ర్గాలు వైసీపీకి చేరువ అవుతాయ‌ని, కులాల‌న్నీ త‌మ‌వైపే ఉంటాయ‌ని వైసీపీ ఆశ‌లు పెట్టుకుంది.నిజ‌మే.

ఇలాంటి ప్ర‌తిష్టాత్మ‌క నిర్ణ‌యం తీసుకుని అమ‌లు చేసిన‌ప్పుడు ఆ మాత్రం ఆశించ‌డం త‌ప్పుకాదు.అయితే, ఇది ఏమేర‌కు సాధ్య‌మ‌వుతుంది? గ‌తంలో బీసీ కార్పొరేష‌న్లు లేవా? అప్పుడు లేని వెసులుబాటు ఇప్పుడు వ‌స్తుందా? అంటే.క‌ష్ట‌మే అంటున్నారు.ప‌రిశీల‌కులు.

దీనికి కారణం.ఏ కార్పొరేష‌న్‌కు అయినా.

అధికారాలు బ‌ద‌లాయించాలి.అదేస‌మ‌యంలో అవ‌స‌ర‌మైన నిధులు ఇవ్వాలి.

ఆధిప‌త్య ధోర‌ణికి, కుటుంబ రాజ‌కీయాల‌కు చెక్ పెట్టాలి.ఈ నాలుగు విష‌యాల్లో స‌రైన పంథా లేక పోతే.

ఎన్ని కార్పొరేష‌న్ల‌యినా.ప్ర‌యోజ‌నం మాత్రం శూన్య‌మ‌నే అంటున్నారు.

టీడీపీ వ్యూహం చూద్దాం.

పార్టీకి బీసీలే వెన్నెముక అని.వారు త‌ప్ప పార్టీని నిల‌బెట్టేవారు లేర‌ని ప‌దే ప‌దే చెబుతున్నారు చంద్ర‌బాబు.ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది ఎదురైన ఘోర ప‌రాభ‌వంపై ఆయ‌న పోస్ట్ మార్టం చేసిన‌ప్పుడు.

కేవలం బీసీలు దూరం అయ్యారు కాబ‌ట్టి.పార్టీ ఓడిపోయింద‌ని తీర్మానించారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా పార్ల‌మెంట‌రీ ప‌ద‌వులు, ఇప్పుడు పార్టీ ప‌ద‌వులు కూడా పూర్తిగా బీసీల‌కు కేటాయించారు.ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.

ఈ ఫార్ములా వ‌ర్క‌వుట్ అవుతుందా? అస‌లు టీడీపీ ఓట‌మికి బాబు అనుకున్న రీజ‌నే కార‌ణ‌మా? అంటే కాద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు కూడా బీసీ నేత క‌ళా వెంక‌ట్రావే పార్టీని న‌డిపించారు.

బీసీల‌కు ఎక్కువ‌గానే టికెట్లు ఇచ్చారు.అయినా ఓడిపోయింది.

దీనికి కార‌ణం.ఏంటి?  అంటే.ప్ర‌త్య‌క్షంగా వారికి ప‌ద‌వులు ఇచ్చినా.అధికారం ఇవ్వ‌క‌పోవ‌డం.పైనుంచి చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యులు చ‌క్రం తిప్ప‌డం, స్వేచ్ఛ లేక‌పోవ‌డం అనే ఈ త్రిసూత్ర‌మే కార‌ణంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.ఈ మూడు విష‌యాల‌ను ప‌క్క‌న పెట్ట‌కుండా.

ఎంత‌మంది బీసీల‌ను నియ‌మించినా.ఎన్ని ఫీట్లు చేసినా.

ప్ర‌యోజ‌నం శూన్య‌మ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube