అనుకున్నదొక్కటి ... అయ్యిందొక్కటి ! వైసీపీకి ఇదే జరిగిందా ..?  

  • ఏపీలో ఏకైక విప‌క్షం వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు తీవ్రంగా తంటాలు ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది ప్రారంభించిన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ను ఎన్నిక‌ల వ‌ర‌కు సాగదీద్దాం అనే రేంజ్‌లో నిర్వ‌హిస్తున్నారు. అంటే … దీనిని సెంటిమెంట్‌గా చూపించి, ప్ర‌జ‌ల నుంచి సింప‌తీ పొందాల‌ని పార్టీ ప్లాన్ చేసింద‌ని భావించ‌వ‌చ్చు. మొద‌ట్లో బాగానే ఉన్నా రాను రాను జ‌గ‌న్ పాడిందే పాట-అన్న‌ట్టుగా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేయ‌డం, తాను అధికారంలోకి వ‌స్తే ఏమేం చేస్తాను! అనేది చెప్పుకు రావ‌డమే మిగిలిపోయింది. దీంతో జ‌నాల‌కు కూడా బోర్ కొట్ట‌డం మొద‌లైంది.ఈ నేప‌థ్యంలో పాద‌యాత్ర‌కు ఒకింత జోష్ త‌గ్గింద‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. దీంతో తిరిగి ప్ర‌జ‌ల నుంచి సింప‌తీ ఎలా పొందాల‌నే విష‌యంపై వైసీపీ అధినేత తీవ్రంగానే కసరత్తు చేస్తున్నారు.

  • YSRCP Trying To Gain Political Mileage-

    YSRCP Trying To Gain Political Mileage

  • అయితే, ఇంత‌లోనే విశాఖ విమానాశ్ర‌యంలో జగన్ పై జరిగిన హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న వైసీపీకి లాభిస్తుంద‌ని ఆ పార్టీ నేత‌లు భావించారు. అంతేకాదు, ఈ ఘ‌ట‌న‌కు త‌మ‌కు సింప‌తీ పెంచుతుంద‌ని అనుకున్నారు. ఈ కోడి క‌త్తి త‌ర్వాత వైసీపీ రేటింగ్ జ‌గ‌న్ రేటింగ్ కూడా పెరుగుతాయ‌ని అనుకున్నారు వైసీపీ నాయ‌కులు. అయితే, అను కున్న‌ది ఒక్క‌టి- అనుకున్న‌ట్టుగానే వైసీపీ నాయ‌కులు ఆశించింది ఏమీ జ‌ర‌గ‌లేద‌ని లోట‌స్ పాండ్ వ‌ర్గాలు పేర్కొంటు న్నాయి. క‌త్తి ఘ‌ట‌న‌తో వైసీపీకి కానీ, జ‌గ‌న్‌కు కానీ రేటింగ్ కూడా పెరిగిన‌ట్టు క‌నిపించ‌డం లేద‌ని నాయ‌కులు గుస‌గుస లాడుతున్నారు.

  • ముఖ్యంగా రెండు విష‌యాల్లో వైసీపీ అధినాయ‌కత్వం ప్లాన్ లేకుండా వ్య‌వ‌హ‌రించింద‌ని, జ‌రిగిన ఘ‌ట‌న‌ను రాజ‌కీయంగా పార్టీకి అనుకూలంగా మ‌లుచుకోవంలో వైసీపీ నాయ‌కులు ఫెయిల‌య్యార‌నేది నాయ‌కుల్లోని ఓ వ‌ర్గం అంటున్న మాట‌. ప్ర‌తి విష‌యానికి రోడ్ల మీద‌కు వ‌చ్చి ధ‌ర్నాలు చేసే వైసీపీ త‌న పార్టీ అధినేత జ‌గన్‌పై దాడి జ‌రిగిన త‌ర్వాత ఏ మాత్రం హ‌డావుడి చేయ‌కుండా మౌనంగా ఉండ‌డం ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకు వెళ్లి సెంటిమెంట్ ప‌వ‌నాలు వ‌చ్చేలా చేయ‌లేద‌నే వాద‌న వినిపిస్తోంది.

  • YSRCP Trying To Gain Political Mileage-
  • ఇక, ఏపీ పోలీస్‌ను న‌మ్మ‌ను అంటూనే జ‌గ‌న్‌ వారిచ్చిన హ‌త్యాయ‌త్నం నివేదిక‌ను ప‌దే ప‌దే ఉటంకించడం మ‌రింత విడ్డూరంగా ఉంద‌నేది కూడా వినిపిస్తోంది. ఈ కోడిక‌త్తి విష‌యాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో ప్ర‌ధాన విప‌క్షం పూర్తిగా విఫ‌ల‌మైంద‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. అయితే, అదేస‌మ‌యంలో ఎదురు దాడి,. ప్ర‌భుత్వం విఫ‌లం కాలేద‌న్న విష‌యాల్లో చంద్ర‌బాబు ఆయ‌న టీం స‌మ‌ర్ధ‌వంతంగా త‌మ బాణిని వినిపించ‌డం గ‌మ‌నార్హం