టీడీపీ కి క్లీన్ చీట్ ... వైసీపీ కి మైండ్ బ్లాక్ !

కోర్టులో వరుసగా ఏపీ ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చి పడుతున్నాయి. వైసిపి అధికారంలో ఉండగా టిడిపి పై చేసిన విమర్శలను తమ ప్రభుత్వంలో నిరూపించేందుకు వైసిపి ఎంతగానో ప్రయత్నిస్తోంది.

 Ysrcp Troubled On Supreme Court Judgement About Amaravathi-issue Ysrcp, Ap, Tdp,-TeluguStop.com

కానీ కోర్టుల్లో టీడీపీకి అనుకూలంగా, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురవుతోంది.వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే కాదు , అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది.

టిడిపి ఈ విషయంలో అనేక అవినీతి వ్యవహారాలకు పాల్పడిందనే విమర్శలు చేసింది.అలాగే పేద, ఎస్సి రైతుల భూములు లాక్కొని ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసింది.

దీనిపై దర్యాప్తుకు ఆదేశించింది అయితే ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు, పురపాలక శాఖ మంత్రి నారాయణ, మంత్రి పుల్లారావు తదితరుల పై ఎక్కువ ఆరోపణలు వచ్చాయి.

దీనిపై విచారణ జరుగుతోంది.

తాజాగా ఈ వ్యవహారం పై సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి.అసలు అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదు అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

దీంతో టిడిపి ఈ విషయంలో పైచేయి సాధించినట్లు అయ్యింది.ఇప్పటికే అమరావతిలో పెద్ద ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసీపీ ప్రభుత్వం సిఐడి , ఏసిబీ, సిట్ వంటి దర్యాప్తు సంస్థల తో విచారణ చేయిస్తోంది.

టిడిపి కీలక నాయకులే టార్గెట్ గా జగన్ ముందుకు వెళ్తున్నారు.,/br>

Telugu Ap, Chandrababu, Jagan, Supreme, Ysrcp-Telugu Political News

తాజాగా సుప్రీం తీర్పుతో ఈ దర్యాప్తులు నిలిచిపోయేలా ఉండడంతో టిడిపి శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.ఇక అమరావతి వ్యవహారంపై మరింత దూకుడుగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడంతో పాటు, పెద్ద ఎత్తున పోరాటాలు చేసేందుకు అవకాశం ఏర్పడింది. సుప్రీం తీర్పు వైసిపి శ్రేణుల్లో నిరుత్సాహం కలిగేలా చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube