లోకేష్ పై పెద్ద మనసు చేసుకున్న వైసీపీ ? ఆ వేధింపులు ఇక లేనట్టే ?  

ysrcp take key desistion about nara lokesh, Nara Lokesh, TDP, CHandrabau Naidu, YSRCP, Jagan, Lokesh Twitter, YSRCP Leaders, Formar It Minister Lokesh - Telugu Chandrabau Naidu, Formar It Minister Lokesh, Jagan, Lokesh Twitter, Nara Lokesh, Tdp, Ysrcp, Ysrcp Leaders

నారా లోకేష్ ను మొదటి నుంచి ర్యాగింగ్ చేస్తున్నట్లుగానే వైసీపీ నాయకులు వ్యవహరిస్తూ వస్తున్నారు.గత టీడీపీ ప్రభుత్వంలో లోకేష్ మంత్రిగా ఉన్న సమయం నుంచే, ఆయన పై వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.

TeluguStop.com - Ysrcp Tke Key Desistion About Nara Lokesh

ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా వదిలిపెట్టకుండా అంతకంటే ఎక్కువ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.రానున్న రోజుల్లో టీడీపీ పగ్గాలు లోకేష్ చేతికి రాబోతున్నాయి అనే అభిప్రాయంతో ఆయనను ప్రజల్లో చులకన చేసి రాజకీయంగా ఆయన అసమర్థుడు అనే అభిప్రాయాన్ని కలుగజేయాలని వైసీపీ ఒక ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తూ వస్తోంది.

అందుకే సందర్భం ఉన్నా, లేకపోయినా లోకేష్ ను టార్గెట్ చేసుకుంటూ, ఆయనను ర్యాగింగ్ చేస్తూ వస్తోంది.

TeluguStop.com - లోకేష్ పై పెద్ద మనసు చేసుకున్న వైసీపీ ఆ వేధింపులు ఇక లేనట్టే -Political-Telugu Tollywood Photo Image

ఈ వ్యవహారం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆవేదన కలిగిస్తున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయలేని పరిస్థితిలో ఆయన సైలెంట్ గానే ఉండిపోతున్నారు.

ఇక కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి లోకేష్ హైదరాబాద్ కే పరిమితమయ్యారు.మధ్యలో ఒకసారి ఏపీకి వచ్చినా, మళ్లీ హైదరాబాద్ లోని తన నివాసానికి పరిమితమైపోయారు.

దీనిపైన వైసీపీ నాయకులు పదే పదే విమర్శలు చేస్తున్నారు.అది కాకుండా లోకేష్ పై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ, అవహేళన చేస్తూ ప్రజల్లో లోకేష్ వ్యవహారాలపై చర్చ జరిగేలా చేస్తున్నారు.

అయితే ఇదంతా వైసీపీకి మేలు చేయకపోగా, లోకేష్ కు ఇదంతా కలిసి వస్తుందనే విషయాన్ని కాస్త ఆలస్యంగా వైసీపీ గుర్తించింది.

ఈ మేరకు ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, లోకేష్ చేస్తున్న విమర్శలపై ప్రజల్లో ఆయనకు సానుభూతి వ్యక్తమవుతోందని, వైసీపీ నాయకులు ఆయనను ఎంతగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తుంటే, అంతగా ఆయన బల పడుతున్నాడని, అనవసరంగా వైసీపీ నాయకులు లోకేష్ ను ఆడిపోసుకుంటున్నారు అనే అభిప్రాయాలు జనాల్లోకి వెళ్ళినట్లుగా గుర్తించింది.

అందుకే ఇకపై లోకేష్ విషయంలో పెద్దగా ఎవరూ స్పందించ వద్దని, స్పందించి లోకేష్ ను హీరో చేయవద్దంటూ, వైసీపీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటి వరకు లోకేష్ ను విమర్శిస్తూ, పోటీ పడుతూ వచ్చిన నాయకులంతా ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అనూహ్యంగా వైసీపీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో లోకేష్ కు పెద్ద గండమే తప్పినట్టు గా కనిపిస్తోంది.

#Lokesh Twitter #Nara Lokesh #YSRCP Leaders #FormarIt #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ysrcp Tke Key Desistion About Nara Lokesh Related Telugu News,Photos/Pics,Images..