ఏపీ సీఎం టార్గెట్‌... మోత్కుపల్లితో వైసీపీ భారీ వ్యూహం.. !

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకుల అందరి టార్గెట్ ఒక్కడే.ఆయనే ముఖ్యమంత్రి చంద్రబాబు.

 Ysrcp Targets Chandrababu With Motkupalli-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఎలాగైనా ఓడించాలి.తాము గద్దె ఎక్కాలనే ఆలోచనలో ఓ వైపు వైసీపీ మరోవైపు జనసేన ఎన్నో కుయుక్తులు పన్నుతున్నారు.

అయితే తెలివిగా వీరిద్దరినీ ఉపయోగించి చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటుంది బీజేపీ.బీజేపీ, పవన్, జగన్ తెర ముందు డైరెక్ట్ గా, కలిసి చంద్రబాబు పై పోరాటం చేస్తుంటే, వెనుక నుండి ముద్రగడ, ఉండవల్లి, ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లాం, పోసాని కృష్ణమురళి, జనచైతన్య వేదిక లక్ష్మణరెడ్డి ఉన్నారు.

వీరి అందరి టార్గెట్ చంద్రబాబుని దించటం.

మొన్నటి వరకు జగన్, ముద్రగడ మాత్రమే ఈ లిస్టు లో ఉండేవాడు.ఒక్కసారి చంద్రబాబు బీజేపీని ఢీ కొట్టటంతో, బీజేపీ వీరందరి చేత, చంద్రబాబుపై దాడి చేయిస్తున్న‌ట్టు అంద‌రికి తెలిసిందే.ప్ర‌స్తుత ప‌రిణామాలు కూడా అందుకు ఊత‌మిచ్చేలాగానే ఉన్నాయి.

ఇంతకీ చంద్రబాబు చేసిన తప్పు ఏంటి అంటే, రాష్ట్రానికి రావాల్సిన హక్కులు గట్టిగా అడగటం.దగా పడ్డ రాష్ట్రానికి, విభజన హామీలు నెరవేర్చండి అని అడగటం.

మాకే ఎదురు తిరుగుతువా అని ఢిల్లీ పెద్దలు, మన ముఖ్యమంత్రి పది దాడి చేస్తుంటే, వీరందరూ ఆ ఢిల్లీ పెద్దలకు సహకరిస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు తెరపైకి మరో కొత్త ముఖం వచ్చింది.

కాకపోతే ఇన్నాళ్లు ఆయనను చంద్రబాబు నాయుడు ఎంతో నమ్మికగా చూశారు.గౌరవం ఇచ్చారు.కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపోయి పరులకు జై కొడుతున్నారు.ఆయనే తెలంగాణ టీటీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు.

ఇప్పడు కొత్తగా మోత్కుపల్లి నరసింహులును కూడా రంగంలోకి దింపేందుకు ఆయనతో వైసీపీ ఎంపీ విజయ్‌సాయిరెడ్డి మంతనాలు జరిపారని టీడీపీ ఆరోపిస్తోంది.తెలంగాణ నేతగా మోత్కుపల్లి వైసీపీలో చేరలేదు.

కానీ ఆ పార్టీ స్పాన్సర్‌షిప్‌తో చంద్రబాబును విమర్శించడానికి రెడీ చేయిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.ఇటీవల మోత్కుపల్లి నర్సింహులును కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కలిశారు.

మోత్కుపల్లికి ముద్రగడ సంఘీభావం తెలిపారు.ఆంధ్రాలో మా జాతిని అణగదొక్కడమే ధ్యేయంగా చంద్రబాబు పెట్టుకున్నారని, మనందరం ఏకమై ఆయనకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, రాష్ట్రానికి రావాలని ఆయన మోత్కుపల్లిని కోరారు.

అంతేకాకుండా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మోత్కుపల్లి ఇంటికి వెళ్లారు.అయితే అక్కడ మీడియాను చూసి వాహనం దిగకుండానే విజయసాయిరెడ్డి వెళ్లిపోయారు.టీడీపీ నుంచి మోత్కుపల్లిని బహిష్కరించిన తర్వాత వారం తిరక్కుండానే ముద్రగడ, విజయ్‌సాయిలు కలవడం వెనుక భారీ వ్యూహం దాగి ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube