ఏపీ సీఎం టార్గెట్‌... మోత్కుపల్లితో వైసీపీ భారీ వ్యూహం.. !     2018-06-14   01:17:51  IST  Bhanu C

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకుల అందరి టార్గెట్ ఒక్కడే..ఆయనే ముఖ్యమంత్రి చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఎలాగైనా ఓడించాలి..తాము గద్దె ఎక్కాలనే ఆలోచనలో ఓ వైపు వైసీపీ మరోవైపు జనసేన ఎన్నో కుయుక్తులు పన్నుతున్నారు. అయితే తెలివిగా వీరిద్దరినీ ఉపయోగించి చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటుంది బీజేపీ. బీజేపీ, పవన్, జగన్ తెర ముందు డైరెక్ట్ గా, కలిసి చంద్రబాబు పై పోరాటం చేస్తుంటే, వెనుక నుండి ముద్రగడ, ఉండవల్లి, ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లాం, పోసాని కృష్ణమురళి, జనచైతన్య వేదిక లక్ష్మణరెడ్డి ఉన్నారు. వీరి అందరి టార్గెట్ చంద్రబాబుని దించటం.

మొన్నటి వరకు జగన్, ముద్రగడ మాత్రమే ఈ లిస్టు లో ఉండేవాడు.. ఒక్కసారి చంద్రబాబు బీజేపీని ఢీ కొట్టటంతో, బీజేపీ వీరందరి చేత, చంద్రబాబుపై దాడి చేయిస్తున్న‌ట్టు అంద‌రికి తెలిసిందే. ప్ర‌స్తుత ప‌రిణామాలు కూడా అందుకు ఊత‌మిచ్చేలాగానే ఉన్నాయి. ఇంతకీ చంద్రబాబు చేసిన తప్పు ఏంటి అంటే, రాష్ట్రానికి రావాల్సిన హక్కులు గట్టిగా అడగటం.. దగా పడ్డ రాష్ట్రానికి, విభజన హామీలు నెరవేర్చండి అని అడగటం.. మాకే ఎదురు తిరుగుతువా అని ఢిల్లీ పెద్దలు, మన ముఖ్యమంత్రి పది దాడి చేస్తుంటే, వీరందరూ ఆ ఢిల్లీ పెద్దలకు సహకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెరపైకి మరో కొత్త ముఖం వచ్చింది.