ఢిల్లీలో గల్లీ పాలిటిక్స్: వైసీపీ ఆ లాజిక్ మిస్ అవుతోందా..?  

ysrcp street politics in delhi ..ycp missing that logic, ysrcp logic, delhi politics, amaravati, ap government, TDP, CBI enquiry, kesineni nani - Telugu @kesineni_nani, Amaravati, Ap Government, Cbi Enquiry, Delhi ..ycp Missing That Logic, Delhi Politics, Enquiry, Kesineni Nani, Logic, Tdp, Ysrcp

ఏపీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని పునఃసమీక్షించడానికి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.అలాగే అమరావతిలో భూకుంభకోణాలు జరిగాయని చెప్పి దానిపై దర్యాప్తు చేయిస్తున్నారు.

TeluguStop.com - Ysrcp Street Politics In Delhi Ycp Missing That Logic

కానీ వీటి అన్నిటికి హైకోర్టు బ్రేకులు వేసింది.ఈ విచారణలపై స్టే విధించింది.

దీంతో అమరావతి కుంభకోణంపై సి‌బి‌ఐ దర్యాప్తు చేయించాలని వైసీపీ ఎంపీలు పార్లమెంట్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

TeluguStop.com - ఢిల్లీలో గల్లీ పాలిటిక్స్: వైసీపీ ఆ లాజిక్ మిస్ అవుతోందా..-Political-Telugu Tollywood Photo Image

అలాగే పార్లమెంట్‌లో కూడా చంద్రబాబుని టార్గెట్ చేసుకునే వైసీపీ ఎంపీలు ముందుకెళుతున్నారు.

ఇక దీనిపై టీడీపీ ఎంపీలు కూడా ఎదురుదాడికి దిగుతున్నారు.ముందు జగన్ మీద కేసులపై సి‌బి‌ఐ విచారణ వేగంగా జరిగేలా చూసుకోవాలని, ఇంకా రాష్ట్రంలో ఇసుక, మద్యం, ఇళ్ల పట్టాలు, మైనింగ్‌లో జరిగిన అక్రమాలపై సి‌బి‌ఐ విచారణ చేయించాలని డిమాండ్ కోరుతున్నారు.

అయితే వైసీపీ ఇక్కడే ఒక లాజిక్ మిస్ అవుతుందని టీడీపీ ఎంపీ కేశినేని నాని చెబుతున్నారు.

ఏ అంశం మీద అయినా సీబీఐ ఎంక్వైరీ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం ఆమోదం తెలపడం ఆనవాయితీ అని అంటున్నారు.ఇక దానికి ధర్నాలు అవసరం లేదని, చెత్త రాజకీయాలు మాని రాష్ట్రానికి రావాల్సిన వాటి పైన పోరాటం చేస్తే మంచిదని చెబుతున్నారు.వాస్తవానికి పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నాయి.

వైసీపీ ఎంపీలు కేవలం చంద్రబాబుని టార్గెట్ చేసుకుని, రాజకీయం చేస్తున్నారు తప్పా, రాష్ట్రానికి రావాల్సిన వాటిపై పార్లమెంట్‌లో మాట్లాడటం లేదు.

ఆఖరికి కరోనా కట్టడి గురించి మాట్లాడాలని రాజ్యసభలో సమయం ఇస్తే, అప్పుడు కూడా విజయసాయిరెడ్డి చంద్రబాబు, అమరావతి అంటూ స్పీచ్ ఇచ్చారు.

ఇక ఈయన స్పీచ్‌ని రికార్డుల నుంచి కూడా తొలగించారు.అసలు వైసీపీ ఎంపీలు ఢిల్లీలో కూడా గల్లీ రాజకీయమే చేస్తున్నట్లు కనిపిస్తుందని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఒకవైపు అమరావతి కుంభకోణంపై విచారణ చేయమని చెబుతూనే, రాష్ట్రానికి రావాల్సిన వాటిపై పోరాడితే మంచిదని హితవు పలుకుతున్నారు.

.

#Enquiry #Amaravati #AP Government #Kesineni Nani #Cbi Enquiry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ysrcp Street Politics In Delhi Ycp Missing That Logic Related Telugu News,Photos/Pics,Images..