వైసీపీ దూకుడుకి..తండ్రీకొడుకులు తట్టుకోగలరా...???   Ysrcp Social Media Wing Targets Chandrababu And Lokesh     2018-10-22   16:18:00  IST  Surya

ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా చంద్రబాబు ఉన్న సమయంలో ఆఫీసుల్లో కంప్యూటర్ లు ప్రవేశ పెడితే ఎంతో ఆశ్చర్యంగా చూశారు..ఇదెక్కడి గోలరా బాబు ప్రశాంతంగా పని చేసుకుంటుంటే చేతకాని వాటిని తెచ్చి ప్రాణాలు తీస్తున్నాడు అంటూ చంద్రబాబు ని తిట్టిపోసుకున్నారు..ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అవే కంపూటర్ లు లేకపోతే నిమిషం కూడా ముందుకు కదిలే ప్రసక్తి లేదు. అలా హైటెక్ సిటీ కట్టి అమెరికాలో టెక్నాలజీని ఇండియాకి పరిచయం చేసి కోర్సులు నేర్పించి నేతోమందిని ఉన్నత భవిష్యత్తు వైపుకి మళ్ళించాడు చంద్రబాబు అందుకే బాబు ని హైటెక్ బాబు అంటూ ఉంటారు. అసలు ఏపీకి టెక్నాలజీ ని పరిచయం చేసిందే బాబు..అలాంటిది..

ఇప్పుడు అదే టెక్నాలజీ చంద్రబాబు పాలిత శాపమయ్యింది..తన వేలితో తన కళ్ళనే పొడిచేలా వైసీపీ అదే టెక్నాలజీ ని ఉపయోగిస్తోంది..అర్థం కాలేదా సరే అసలు విషయంలోకి వెళ్తే..బాబు టెక్నాలజీ ని సాఫ్ట్వేర్ కోసం ఉపయోగించాడు ప్రభుత్వంలో పని తీరుకోసం ఇలా ఉపయోగించాడు సక్సెస్ అయ్యారు తప్ప ఒక్క సోషల్ మీడియాలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కానీ అదే సోషల్ మీడియాలో వైసీపీ మాత్రం దూసుకుపోతోంది. చంద్రబాబు, లోకేష్ లని సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటోంది.

వచ్చే ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇప్పటి స్పీడు కంటే మరింత స్పీడు ఉండేలా సోషల్ మీడియాలో రెచ్చిపోవటానికి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరింత జోరు పెంచుతున్నారు. గత ఎన్నికల్లో సోషల్ మీడియాలో వెనుక బడిన జగన్ , గడిచిన మూడేళ్ళ కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్నారు…ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఉన్న హైప్ మాములుగాలేదు అందుకే ఆ రంగాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు లోకేష్ లని చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యిందట వైసీపీ అందులో భాగంగానే

Ysrcp Social Media Wing Targets Chandrababu And Lokesh-

వైసిపి సోషల్ మీడియా విభాగం రెండంచెల వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఒకవైపు జగన్ అనుకూల ప్రచారం చేస్తూనే

చంద్రబాబు లోకేష్ లని ఎకేస్తున్నారు..ఆ దెబ్బతో ఇప్పటి వరకూ కనీసం ఆరుగురిమీద కేసులు పెట్టి జైళ్ళ కి పంపారంటే ఆ ప్రభావం ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు…అయితే ఎలాగూ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సోషల్ మీడియా జోరును మరింత పెంచాలని జగన్ నిర్ణయించారు..ఈ క్రమంలోనే మండలస్ధాయిలో కూడా సోషల్ మీడియా ప్రచారం కోసం ప్రత్యేకంగా కమిటీలను వేశారు. రాష్ట్రంలోని 6 వందలపై చిలుకు మండలాల్లో బాగా యాక్టివ్ గా పనిచేసే కురాళ్ళతో పార్టీ కమిటీలు వేసింది. ప్రతీ కమిటీలో కనీసం 15 మందకి తగ్గకుండా ఉంటారట.ఇప్పటికే చంద్రబాబు ని లోకేష్ లని ఉతికి ఆరేస్తున్న వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు పెంచిన స్పీడుతో టీడీపీ కి ఇంకెంత డ్యామేజ్ తీసుకురానుందో వేచి చూడాలి .