రామకృష్ణంరాజు కాలి గాయాల మెడికల్ రిపోర్ట్..!!

సుప్రీం ఆదేశాల మేరకు రఘురామకృష్ణంరాజుకి చేసిన వైద్య పరీక్షలలో  కాలికి అయిన గాయాలు నిజమే అని మెడికల్ రిపోర్టులో తేలింది.పూర్తి విషయంలోకి వెళ్తే ప్రభుత్వాన్ని కావాలనే అస్థిర పరచటానికి రఘురామకృష్ణంరాజు కొన్ని మీడియా సంస్థలతో కుట్ర పనిన్నట్లు ఏపీ సిఐడి ఇటీవల కేస్ ఫైల్ చేసి అరెస్టు చేయటం మనకందరికీ తెలిసిందే.

 Ysrcp Rebel Mp Raghurama Krishnam Raju Medical Report, Raghurama Krishnam Raju,-TeluguStop.com

ఆ సమయంలో సిఐడి పోలీసులు రఘురామకృష్ణం రాజును న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా.పోలీసులు కొట్టినట్లు రఘురామకృష్ణంరాజు న్యాయమూర్తి కి ఫిర్యాదు చేశారు.

అదే సమయంలో రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది.ఈ క్రమంలో రఘురామ కృష్ణం రాజు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన న్యాయస్థానం .రఘురామకష్ణంరాజు కాలి గాయాల గురించి పరీక్షలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ఆ సమయంలో రఘురామకృష్ణం రాజు కి  గుంటూరు జీజీహెచ్ లో 18 రకాల వైద్య పరీక్షలు చేశారు.

అవి పోలీసులు కొట్టిన దెబ్బలా…గాయాలు కాదని రిపోర్ట్ వచ్చింది.ఈ తరుణంలో రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది.దీంతో సుప్రీంకోర్టు రఘురామకృష్ణం కాలి గాయాలకు సంబంధించి వైద్య పరీక్షలు మళ్లీ నిర్వహించాలని .సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో వీడియో రూపంలో చిత్రీకరించాలని తెలిపారు.

అయితే తాజాగా రఘురామ కృష్ణంరాజుకి జరిపిన వైద్య పరీక్షలలో కాలికి గాయాలు వాస్తవమే, అవి ఎప్పటినుండో ఉన్న గాయాలు కాదని ఇటీవల తగిలిన దెబ్బలన్ని రిపోర్టులో తేలిందట.

Telugu Ap Cid, Leg, Medical, Suprem, Ycp Rebel Mp, Ysrcp Mp-Telugu Political New

దీంతో రిపోర్ట్ నివేదిక రూపంలో సుప్రీంకోర్టులో ఈరోజు ప్రవేశపెట్టడంతో.ఆర్మీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్టు పై ప్రభుత్వం తరపు న్యాయవాదులు అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం.ఇదిలా ఉంటే ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు కి సంబంధించి బెయిల్ వాదనలు ఇంకా సుప్రీంకోర్టులో సాగుతున్నాయి.

సుప్రీంకోర్టు ఎంపీ గాయాల పట్ల ఏ విధంగా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube