ఆ ఎంపీ గారు జగన్ ను లెక్కచేయకపోవడం వెనుక ఇంత కదా ఉందా ?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు చెబితే ఆ పార్టీలో జగన్ నిర్ణయమే అంతిమం.జగన్ తాను స్టాండ్ తో అయితే ముందుకు వెళ్తున్నానో అదే స్టాండ్ లో అందరూ నడవాలని చూస్తుంటాడు.

 Ysrcp Raghu Rama Krishnam Raju In Jagan Mohan Reddy-TeluguStop.com

ఇక ఆ పార్టీలో ధిక్కారం అనే మాటకు చోటు ఉండదు.ఒకవేళ ఎవరైనా అలా తోక జాడిస్తే వారిని ఇంటికి సాగనంపడం జగన్ స్టైల్.

కానీ రెండు మూడు రోజులుగా ప్రముఖ పారిశ్రామిక వేత్త, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం జగన్ కు మింగుడు పడడం లేదు.ఆయన పార్టీ మారేందుకు ఇలా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు అనే అనుమానం అందరి లోనూ ఉంది.

అయినా రఘురామ కృష్ణంరాజు వైసీపీలోనే ఉన్నారు.అయితే ఎంత కాలం ఉంటారో చెప్పలేని పరిస్థితి.

Telugu Apcm, Raghurama, Yv Subba Reddy, Ycpjagan, Ycpmp, Ysrcpraghu-

పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.అదే సమయంలో ఈ ఏంపీగారు ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చేలా పార్లమెంట్ లో తెలుగు భాష గురించి మాట్లాడి వైసీపీని మరంత ఇరుకున పడేశాడు.అయితే తాను ఏ తప్పు చేయలేదని, నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అంటూ రఘురామకృష్ణంరాజు చెబుతున్నారు.తాను యాదృచ్చికంగానే పార్లమెంలో తెలుగు భాష గురించి మాట్లాడానని, వైసీపీని ఇబ్బంది పెట్టే ఆలోచన తనకు లేదని రఘురామకృష్ణంరాజు చెప్పుకుంటున్నారు.

ఇక రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో చాలావరకు డామేజ్ అవడంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జగన్ రఘురామకృష్ణం రాజు కు గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సిందిగా గోదావరి జిల్లాల పార్టీ ఇంచార్జి వై వి సుబ్బారెడ్డి కి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

Telugu Apcm, Raghurama, Yv Subba Reddy, Ycpjagan, Ycpmp, Ysrcpraghu-

పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎవరు ఎదురుతిరిగినా తాను ఉపేక్షించమని జగన్ సీరియస్ గానే సుబ్బారెడ్డి తో చెప్పడం, ఈ మేరకు సుబ్బారెడ్డి ఫోన్ లో రఘురామ కృష్ణంరాజు తో మాట్లాడి జగన్ ఆగ్రహం గురించి చెప్పారట.అయితే తాను ఏ తప్పు చేయలేదని అవసరమైతే దీనిపై వివరణ ఇస్తానని చెప్పాడట.ప్రస్తుతం వైసీపీలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

అదీకాకుండా ఎంపీగా గెలిచిన దగ్గర్నుంచి రఘురామకృష్ణంరాజు వైసీపీ తరఫున కాకుండా తన సొంత ఇమేజ్ ను పెంచుకుంటూ బిజెపి నాయకులతో దగ్గరగా సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.ఆయనకు తమిళనాడు ఈశాన్య రాష్ట్రాలలో పవర్ ప్లాంట్స్ తో పాటు అనేక వ్యాపారాలు ఉండడంతో రఘురామకృష్ణంరాజు బీజేపీతో తప్పనిసరిగా సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఆయనకి ఏర్పడింది.

Telugu Apcm, Raghurama, Yv Subba Reddy, Ycpjagan, Ycpmp, Ysrcpraghu-

ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీ కన్నా బిజెపితోనే ఎక్కువ టచ్ లో ఉంటూ జగన్ కు ఆగ్రహం తెప్పిస్తున్నట్టుగా తెలుస్తోంది.జగన్ ఆగ్రహం ఎంత దూరం తీసుకువెళుతుంది అనేది తెలియకపోయినా, వైసిపి తన విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఫర్వాలేదు తనకు బీజేపీ అండ ఎలాగూ ఉంది అన్నట్టు గా రఘురామకృష్ణంరాజు ఉన్నట్టుగా అర్థం అవుతోంది.మొత్తానికి ఈ వ్యవహారం వైసీపీలో ప్రకంపనలు రేకెత్తిస్తుంది.కృష్ణంరాజు పార్టీని వీడితే ఆయన బాటలో మరికొందరు వెళ్లే ప్రమాదం ఉందని వైసిపి భయపడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube