వైసీపీ కొత్త స్ట్రాటజీ! టీడీపీలో ఎమ్మెల్యేలపై అనర్హత పిటీషన్స్  

ఒకేరోజు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ అనర్హత పిటీషన్..

Ysrcp Play Different Strategy For Tdp Mla Candidates-tdp Mla Candidates,tdp Party,ysrcp Play Different Strategy

ఏపీ రాజకీయాలలో ఊహించని ఫలితాలతో భారీ ఆధిక్యం సొంతం చేసుకొని అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ ఇప్పుడు ఏపీ రాజకీయాలపై పట్టు బిగించే ప్రయత్నం చేస్తుంది. ఓ వైపు ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలు, నవరత్నాలు అమలు చేసి ప్రజలలో తనపై ఉన్న నమ్మకాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరో వైపు ఏపీలో తమకి ప్రత్యామ్నాయంగా ఉన్న టీడీపీ పార్టీని రాజకీయంగా కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు..

వైసీపీ కొత్త స్ట్రాటజీ! టీడీపీలో ఎమ్మెల్యేలపై అనర్హత పిటీషన్స్-YSRCP Play Different Strategy For TDP MLA Candidates

దీనికి ఓ వైపు రాజకీయ దాడులు చేస్తూ టీడీపీ శ్రేణులని భయపెడుతున్నారు. అలాగే బీజేపీ పార్టీని వెనకుండి తోస్తూ ఫిరాయింపులు ప్రోత్సహిస్తుంది. అయితే వైసీపీలో మాత్రం టీడీపీ నేతలకి చోటు లేదని జగన్ ఇప్పటికే ప్రకటించేసారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు టీడీపీ తరుపున గెలిచినా ఎమ్మెల్యేలని ఓడించడానికి వైసీపీ ప్రభుత్వం తనకున్న అన్ని అవకాశాలని ఉపయోగించుకుంటుంది. అందులో భాగంగా కొత్త స్ట్రాటజీని తెరపైకి తీసుకొచ్చింది. అది టీడీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటీషన్ వేసి దానిని కోర్ట్ ద్వారా తమకి అనుకూలంగా మార్చుకొని అక్కడ గెలిచినా ఎమ్మెల్యేల పదవులు పోయి రెండో స్థానంలో ఉన్న తమ పార్టీ నేతలు ఎమ్మెల్యేలని చేసే ప్రణాళికలు చేస్తుంది.

అందులో భాగంగా ఒకే రోజు ఏకంగా ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల మీద ప్రత్యర్ధులుగా ఉన్న వైసీపీ నేతలు అనర్హత పిటీషన్ లు హై కోర్ట్ లో దాఖలు చేశారు. అందులో శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచినా అచ్చెన్నాయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం మీద పిటీషన్ దాఖలు చేసారు. వీరు ఎన్నికల సంఘంకి ఇచ్చిన అఫిడివిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని, తమ మీద ఉన్న కేసులు గురించి అందులో ప్రస్తావించలేదని, ఈ కారణంగా వారిని అనర్హులుగా ప్రకటించి తరువాత స్థానంలో ఉన్న తమని ఎమ్మెల్యేలుగా చేయాలని కోర్టు పిటీషన్ లో పేర్కొన్నారు.

మరి దీనిపై కోర్ట్ ఏం సమాధానం చెబుతుంది అనేది వేచి చూడాలి.