రోజా ఓడిపోతే వైసీపీ అధికారంలోకి వస్తుందా! సెంటిమెంట్ రిపీట్ అవుతుందా

ఏపీ రాజకీయాలలో సినీనటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న రోజా తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేసి తనదైన గుర్తింపుని సొంతం చేసుకుంది.తెలుగుదేశం పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోజా ఆ పార్టీ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యే గా బరిలో నిలబడింది.

 Ysrcp Party Leaders Try To Damage Roja Image In Party-TeluguStop.com

అయితే రెండు సార్లు ఆమె ఓటమి చవి చూసింది.తర్వాత టీడీపీలో తనకి జరుగుతున్న అవమానం తట్టుకోలేక పార్టీ నుంచి బయటకి వచ్చేసింది.

టీడీపీలో ఉన్నంత కాలంలో కాంగ్రెస్ పార్టీ మీద, తరువాత మెగాస్టార్ చిరంజీవి మీద తన మాటల ప్రతాపం చూపించిన రోజా టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచింది.

అయితే ఆమె ఎమ్మెల్యేగా గెలిచినా వైసీపీ ఓడిపోవడంతో రోజా గెలిస్తే పార్టీ గారంటీగా ఓడిపోతుంది.

రోజా ఓడిపోతే పార్టీ అధికారంలోకి వస్తుంది అనే సెంటిమెంట్ బలంగా ప్రజలలోకి వచ్చేసింది.అయితే ఈ నేపధ్యంలో ఈ సారి వైసీపీ అధికారంలోకి రావాలంటే కచ్చితంగా రోజా ఓడిపోవాలనే మాటలు రాజకీయ వర్గాలలో వినిపిస్తూ ఉండటంతో పాటు, జగన్ కి భాగా చేరువ అయిన ఆమె గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తే ఆమెకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తున్న నేపధ్యంలో జగన్ కి ఆమెని దూరం చేయాలంటే ఓడించడం ఒక్కటే ఉన్న అవకాశం అని భావించి కొందరు వైసీపీ నేతలు ఆమె ఓటమి కోసం టీడీపీక్కి సహకరించారనే టాక్ బలంగా వినిపిస్తుంది.

గత కొంత కాలంగా రోజా కూడా పార్టీ తరుపున తన వాయిస్ వినిపించకుండా సైలెంట్ గా ఉండటానికి కారణం ఇదే అనే టాక్ వినిపిస్తుంది.మరి ఇలాంటి పరిస్థితిలో రోజా నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube