వారందరికీ ఏమైంది ? అసలు వైసీపీలో ఏం జరుగుతోంది ?  

ysrcp leaders are political silence aganist tdp YSRCP, Nara Lokesh, Buggana Rajendranath, Botsa Satyanarayana, Perni Nani, Peddi Reddy Ramchandra Reddy, Chandrababu, - Telugu Avanthi Srinivas, Chandrababu, Government, Minister, Mla, Mp, Perni Nani, Rajandarnath Reddy, Tdp, Ysrcp

గత కొద్ది రోజులుగా ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ, అధికారం చేపట్టిన తర్వాత కొంతమంది నాయకులు అదేపనిగా తమ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ, పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ హడావుడి చేసేవారు.

TeluguStop.com - Ysrcp Party Leaders Are Political Silence Aganist In Tdp

ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తో పాటు, మరికొంతమంది పార్టీ నాయకులను అదేపనిగా విమర్శిస్తూ, ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు.కొంతమంది మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, తరచుగా పార్టీకి సైతం ఇబ్బందికరంగా వ్యవహరించేవారు.

అయితే ఏమైందో ఏంటో తెలియదు కానీ, గత కొంతకాలంగా వైసీపీ లో ఫైర్ బ్రాండ్ నాయకులు అంతా పూర్తిగా సైలెంట్ అయిపోయారు.ఎక్కడా ఎవరూ ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా, పూర్తిగా మౌనంగా ఉంటున్నారు.

TeluguStop.com - వారందరికీ ఏమైంది అసలు వైసీపీలో ఏం జరుగుతోంది -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకులకు కొదవలేదు.చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్ కు అత్యంత సన్నిహితుడు.ఇప్పుడు వైసీపీలో ఆయన, ఆయన కుమారుడి హవా నడుస్తోంది.ఇంకా ఎప్పుడూ చంద్రబాబుపై విమర్శలు చేయాలంటే ఆయనే ఎప్పుడూ ముందు ఉంటూ ఉంటారు.

ఇక కర్నూలు జిల్లాకు చెందిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం తన లాజిక్ లతో ఎప్పుడు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే ఉంటారు.అసెంబ్లీ లోనూ బయటా చేసే విమర్శలకు చంద్రబాబు సైతం బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉంటుంది.

అలాగే ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ, నెల్లూరు జిల్లాకు చెందిన యువ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కృష్ణా జిల్లాకు చెందిన పేర్నినాని, విశాఖ జిల్లాలకు చెందిన అవంతి శ్రీనివాస్, ఇలా నాయకులందరూ గతంతో పోలిస్తే, చాలా సైలెంట్ అయిపోయారు.అసలు దీనికి కారణం ఏమిటో ఎవరికీ తెలియని పరిస్థితి.అయితే టీడీపీపై అదేపనిగా మంత్రులు, ఎమ్మెల్యేలంతా విమర్శలు చేస్తుండడంతో, టీడీపీకి బాగా సానుభూతి పెరుగుతోందని, దీని వల్ల వైసీపీకి పెద్దగా కలిసి రాకపోగా, ముందు ముందు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని గ్రహించిన జగన్ అందరిని సైలెంట్ గా ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.ముఖ్యంగా ఏపీ మంత్రి కొడాలి నాని సైతం కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటున్నారు.

అప్పుడప్పుడు అత్యవసరమైతేనో, మీడియా ఇబ్బంది పెడితే తప్ప పెద్దగా ఆయన స్పందించడం లేదు.దీంతో అసలు వైసీపీ లో ఏం జరుగుతోంది అనే ఉత్కంట అందరిలోనూ నెలకొంది.

#Ysrcp #Chandrababu #Minister #Perni Nani #Government

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ysrcp Party Leaders Are Political Silence Aganist In Tdp Related Telugu News,Photos/Pics,Images..