వైసీపీ కి మరో తలనొప్పి ? సుజనతో ఎమ్మెల్యే ఎంపీలు రహస్యంగా ?  

Ysrcp Mps Mlas Jagan Sujana Chowdary - Telugu Ap, Cctv Footage, Jagan, Kamineni Srinivas Rao, Nimmagadda Ramesh Kumar, Sujana Chowdary, Ysrcp, Ysrcp Mp\\'s And Mla\\'s

ఏదో ఒక అంశంతో నిత్యం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తంటాలు పడుతూనే వస్తోంది.ఇప్పటి వరకు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో వైసిపి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

 Ysrcp Mps Mlas Jagan Sujana Chowdary

అలాగే ఎన్నికల ప్రధాన అధికారి గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలోనూ వైసిపి కాస్త పైచేయి సాధించినట్లుగా కనిపిస్తోంది.ముఖ్యంగా బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో నిమ్మగడ్డ రమేష్ కుమార్, మాజీమంత్రి కామినేని శ్రీనివాస రావు భేటీ అయిన విషయం వెలుగులోకి రావడం ఇప్పుడు కలకలం రేగుతోంది.

తెలుగుదేశం పార్టీకి మేలు చేసే విధంగా సుజనా చౌదరి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.ఈ వ్యవహారం ఇలా ఉండగానే, ఇప్పుడు మరో అంశం వైసీపీని కలవరపెడుతోంది.

వైసీపీ కి మరో తలనొప్పి సుజనతో ఎమ్మెల్యే ఎంపీలు రహస్యంగా -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

సుజనా చౌదరితో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కొంతమంది రహస్యంగా భేటీ అయినట్లు వైసిపికి ఆధారాలు లభించాయట.దీంతో ఒక్కసారిగా వైసీపీ లో కలవరం మొదలైంది.ఇప్పటికే ఆ ఆధారాలను బట్టి సుజనా చౌదరితో పాటు కొంతమంది పార్టీ నాయకులను పిలిచి ప్రభుత్వ సలహాదారులు కొంతమంది వివరణ కోరినట్లు తెలుస్తోంది.అసలు ఈ క్లిష్ట పరిస్థితుల్లో సుజనాచౌదరి తో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు భేటీ కావాల్సి వచ్చింది అనే విషయం పై వైసీపీ అధిష్ఠానం సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఇంకా ఎంత మంది నేతలు వారికి టచ్ లో ఉంటున్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

వైసిపి నాయకులు సుజనాచౌదరి ని కలిశారనే విషయం బయటకు పొక్కడంతో, బిజెపి కూడా అలర్ట్ అయ్యిందట.అసలు సుజనా చౌదరి పై వైసిపి నిఘా పెట్టడమే కాకుండా, వీడియో ఫుటేజ్ సేకరించడం వంటి అంశాలను బిజెపి సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.ఈ మేరకు సుజనా చౌదరి కూడా ఈ వ్యవహారంపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యాడట.

ప్రస్తుతం ఈ వ్యవహారం వైసీపీ లో హాట్ టాపిక్ గా మారింది.మొత్తం తమ వ్యతిరేక శక్తులంతా కలిసి పార్టీని దెబ్బతీసేందుకు ఈ విధంగా కుట్రలు పన్నుతున్నారనే అనుమానాలు ఇప్పుడు వైసీపీలో ఎక్కువయ్యాయి.

అందుకే అనుమానం ఉన్న ప్రతి ఒక్క నాయకుడు మీద నిఘా పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ysrcp Mps Mlas Jagan Sujana Chowdary Related Telugu News,Photos/Pics,Images..

footer-test