రాజధానిపై విజయసాయిరెడ్డి మాట ఇదే  

Ysrcp Mp Vijayasaireddi About Ap Capital-

ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వాలో ఆదివార పార్టీ నేతలకు ఒక స్పష్టమైన క్లారిటీ లేకుండా పోయింది.అందుకే ఎవరు ఇష్టమొచ్చినట్టుగా వారు రాజధానిపై స్పందిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు.

Ysrcp Mp Vijayasaireddi About Ap Capital- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Ysrcp Mp Vijayasaireddi About Ap Capital--Ysrcp Mp Vijayasaireddi About Ap Capital-

ఇప్పటికే రాజధానిని అమరావతిలో కొనసాగిస్తారా లేదా అనే విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది.ఈ నేపథ్యంలోనే మంత్రులు ఒక మాట, ముఖ్యమంత్రి ఒక మాట, ఆ పార్టీ నాయకులు ఒక మాట చెబుతూ జనాల్లో లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారు.

శాసన మండలిలో ఓ సభ్యురాలు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సమాధానం ఇస్తూ అమరావతి నుంచి రాజధానిని తరలించబోమని క్లారిటీ ఇచ్చారు.కానీ ఆ తరువాత రోజే స్పందించిన బొత్స రాజధానిపై కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే క్లారిటీ వస్తుందని, ఆ విషయాన్నీ అసెంబ్లీలో చర్చించిన తర్వాతే స్పష్టత వస్తుందంటూ చెప్పుకొచ్చారు.

Ysrcp Mp Vijayasaireddi About Ap Capital- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Ysrcp Mp Vijayasaireddi About Ap Capital--Ysrcp Mp Vijayasaireddi About Ap Capital-

తాజాగా ఇదే అంశంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు.విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన నిపుణుల కమిటీ సిఫార్సులు, నివేదికల ఆధారంగా రాజధాని విషయంలో సీఎం జగన్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారు అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు విజయసారి రెడ్డి.ఆయన ఓ నెగటివ్ వ్యక్తి అంటూ, జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూడలేకనే ఆయనపై టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికను పూర్తి స్థాయిలో సమీక్షించి ఆ తరువాత జగన్ తగిన నిరయం తీసుకుంటారు అంటూ విజయసాయి క్లారిటీ ఇచ్చారు.

తాజా వార్తలు

Ysrcp Mp Vijayasaireddi About Ap Capital- Related....