విశాఖ స్టీల్ ప్లాంట్ పై కీలక నిర్ణయం తీసుకున్న వైసీపీ.. ?

ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ అంశం పై వైసీపీ నోరెత్తడం లేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

 Ysrcp Mp Vijayasai Reddy Decided To Make Padayatra Against Privatization Of Viza-TeluguStop.com

అదీకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పార్టీలకు అతీతంగా విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతు పలకాలని, ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కార్మికులు వెల్లడిస్తున్నారు.

కాగా ఇప్పటికే అనేక పార్టీలు కార్మికులకు మద్దతు పలుకుతున్న నేపధ్యంలో వైసీపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 20 వ తేదీన పాదయాత్రకు సిద్ధమైంది.ఇందులో భాగంగా ఈనెల 20 వ తేదీన విశాఖలోని జీవీఎంసీ నుంచి కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ గేటు వరకు మొత్తం 22 కిలోమీటర్ల మేర వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్ర చేపట్టబోతున్నారు.

Telugu Padayatra, Steel, Vijayasai Reddy, Visakhapatnam, Ysrcp Mp-Latest News -

అయితే విశాఖ నగరంలోని అన్ని నియోజక వర్గాలను కవర్ చేస్తూ ఈ మహా పాదయాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది.ఇకపోతే కార్మికులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఈ పాదయాత్ర చేపడుతున్నట్టు విజయసాయిరెడ్డి పేర్కొంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube