టీడీపీ మాజీ మంత్రికి వైసీపీ ఎంపీ టికెట్‌..!

ఆయ‌న టీడీపీలో చాలా త‌క్కువ టైంలోనే కీల‌క‌మైన నేత‌గా మారారు.పార్టీ అధినేత చంద్ర‌బాబుకు చాలా స‌న్నిహితంగా మెలిగారు.

 Ysrcp Mp Ticket For Ravela Kishore Babu-TeluguStop.com

ఈ నేప‌థ్యంలోనే రాజ‌కీయాలకు కొత్తే అయినా.చంద్ర‌బాబు ఆయ‌న‌కు నేరుగా మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు.

అయితే వ‌రుస‌గా ఆయ‌న వివాదాల్లో చిక్కుకున్న‌ వైనం స‌ద‌రు మంత్రి వ‌ర్యుల‌కు తీవ్ర స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించింది.ఫ‌లితంగా ఆయ‌న మంత్రి ప‌ద‌వినే పోగొట్టుకున్నారు.

ఆయ‌నే గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన రావెల కిషోర్ బాబు.గత ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన‌మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌నకు చంద్ర‌బాబు హ్యాండిచ్చారు.

దీంతో అప్ప‌టి నుంచి రావెల తీవ్ర మ‌న‌స్థాపంతో ఉన్నారు.ద‌ళిత వ‌ర్గానికి చెందిన ఆయ‌న మ‌ళ్లీ పూర్వ వైభ‌వం కోసం ఎంత ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండా పోయింది.

ప్ర‌స్తుతం ప్ర‌త్తిపాడులో ఉన్న ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టీడీపీ నుంచి అసెంబ్లీ టికెట్ కూడా ల‌భించే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు.దీంతో రావెల వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి విప‌క్షం వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని వార్త‌లు గ‌త ఆరేడు నెల‌లుగానే వినిపిస్తున్నాయి.అయితే, ఈ ద‌ఫా అసెంబ్లీకి కాకుండా గుంటూరు జిల్లా బాప‌ట్ల పార్ల‌మెంటు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.ఇప్ప‌టికే జ‌గ‌న్‌కు స‌న్నిహితంగా కొంద‌రు పార్టీ నేత‌ల ద్వారా ఈ విష‌య‌మై చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ని టాక్‌.

కొన్నాళ్లు మౌనంగా ఉన్న ఈ మాజీ మంత్రి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.మరోసారి త‌న ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు.

వచ్చే ఎన్నికల్లో తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తే… క‌నీసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని ఆయన బహిరంగంగానే చెబుతున్నారట.ఇదే విష‌యాన్ని ఆయ‌న వైసీపీ అధినేత‌కు వ‌ర్త‌మానం పంపార‌ట.

విద్యాధికుడు కావ‌డం, ద‌ళిత వ‌ర్గాల్లో పలుకుబ‌డి ఉండ‌డంతో త‌న‌కు టికెట్ ఇస్తే గెలుపు ఖాయ‌మ‌నే ప్ర‌చారం కూడా చేసుకుంటున్నారు.

ప్ర‌స్తుతం ఈయ‌న ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు సంబంధించి భారీ ఎత్తున కార్యాచ‌ర‌ణ‌కు కూడా సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది.

ఇప్ప‌టికే త‌న వ‌ర్గం వారితో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపారు.ఒక‌వేళ రేపు పార్టీ మారితే.

అధికార టీడీపీకి గ‌ట్టి దెబ్బ త‌గిలింది! అని అనిపించేలా కూడా వ్యూహం సిద్ధం చేసుకుంటున్నార‌ట‌.అయితే, ఈ విష‌యంలో జ‌గ‌న్ ఇప్ప‌టికీ ఓ నిర్ణ‌య‌మైతే తీసుకోలేదు.

రావెల రావ‌డంతో పార్టీకి బ‌లం చేకూర‌డం క‌న్నా.తాను ఇప్ప‌టికీ తేల్చ‌ని ఎమ్మార్పీఎస్ వివాదం మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

రావెల‌కు ఎమ్మార్పీఎస్ అండ‌గా ఉంటోంది.ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు జ‌గ‌న్ ఈయ‌న‌కు రెడ్ కార్పెట్ ప‌రుస్తాడా? లేదా ? చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube