రాజుగారా మజాకా : ఏంటి ఒక్కో కిళ్లీ వెయ్యా ? విందు మాములుగా లేదా ?  

ysrcp mp raju arranging celebrities - Telugu Pan, Raguramakrishnamraju Mp Narasapuram Ysrcp Jagan Vijayasaireddy Mithunreddy Prime Minister Narendra Modhi

గోదారోళ్ళ ప్రేమలు ఆప్యాయత ఎలా ఉంటాయో ‘రుచి’ చూపించేందుకు సిద్ధమైపోతున్నారు నరసాపురం వైసిపి ఎంపీ రఘురామకృష్ణంరాజు.అయితే అవన్నీ ఆషామాషీ వ్యక్తులకు కాదు.

 Ysrcp Mp Raju Arranging Celebrities

బిజెపి కీలక నాయకులందరికీ ఈ విందును ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నారు ఈ రాజు గారు.కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజుగారు హౌ ఆర్ యు అంటూ పలకరించినప్పటి నుంచి ఈ వైసీపీ ఎంపీ గారి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

దీనిపై వైసిపి అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రాజుగారు మాత్రం ఎక్కడా లెక్క చేయడమే లేదు.తరచుగా బిజెపి నేతలను కలుస్తూ హడావుడి చేస్తున్నాడు.

తాజాగా డిసెంబర్ 11వ తేదీ రాత్రి ఢిల్లీలో భారీ విందు రఘురామకృష్ణంరాజు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తదితర నాయకులంతా హాజరు కాబోతున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే రాజు గారు ఇచ్చే విందు విషయమై ఇప్పుడు అంతా చర్చ నడుస్తోంది.ఈ అగ్ర నాయకులకు ఇచ్చే విందు కోసం భారీ మెనూను ఈ ఎంపీ గారు సిద్ధం చేశారట.

ఈ విందులో ఇచ్చే ఒక్కొక్క కిళ్లీ ఖరీదు వెయ్యి రూపాయలు పెట్టి మరి తయారు చేస్తున్నారట.ఈ విందుకు సుమారు మూడు వేల మంది వీఐపీలు హాజరు కాబోతుననట్టు తెలుస్తోంది.

ఒక్క కిళ్లీ కోసమే వెయ్యి రూపాయలు ఖర్చుపెడుతుంటే మిగతా వంటల కోసం ఎంత ఖర్చుపెట్టబోతున్నారో అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ysrcp Mp Raju Arranging Celebrities Related Telugu News,Photos/Pics,Images..