జనసేన ,వైసీపీల కీలక భేటీ..పొత్తు ఖాయమేనా..?       2018-07-02   04:11:14  IST  Bhanu C

ముందస్తు మంత్రం ఇప్పుడు ఏపీలో అధికారపార్టీ నేతల్లో గుబులు రేపుతుంటే ఏప్పుడు ఎన్నికలు వచ్చేస్తాయా అంటూ ప్రతిపక్ష పార్టీలు ఎదురు చూస్తున్నాయి..ఇది ఏపీలో పరిస్థితి అయితే తెలంగాణలో మాత్రం ఇది పూర్తిగా భిన్నంగా ఉంది దానికి కారణం తెలంగాణా ప్రభుత్వానికి మళ్ళీ గెలవగలం అనే నమ్మకం ఉండటమే…అయితే ఏపీలో చంద్రబాబు కి మాత్రం ఈ నమ్మకం లేనట్లు ఉంది అందుకే ఈ మధ్యకాలంలో లోకేష్ తో సహా కీకల నేతలు ముందస్తు పై కామెంట్స్ ఎటూ తేల్చుకోలేక కేంద్రం చెప్పింది మేము చేయం అంటూ కప్పదాటవేస్తున్నారు..

అయితే ఎపీకి కేంద్రం మోసం చేసిందన్న కసి ప్రజలలో ఉండనే ఉంది ఈ కారణం వలన బీజేపీ ఏపీలో ఎంతవరకూ సక్సెస్ అవుతుంది అంటే బీజేపి తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది..అయితే ప్రస్తుతానికి మాత్రం ఏపీలో బీజీపీ కి ఒక్క ఓటు కూడా పడదని చెప్పడంలో సందేహం లేదు..అందుకే బీజేపి ఎంతో వ్యూహాత్మకంగా తాము లేకపోయినా తన మాట వినే పార్టీలు అయిన లా జనసేన ,వైసీపిలని ఇప్పుడు ఒక్కటి చేయబోతోంది..

చంద్రబాబుకు మళ్ళీ అధికారం దక్కకుండా ఉండాలి అంటే తప్పకుండా జగన్ పవన్ కలవాల్సిన అవసరం ఎంతో ఉంది ఏపీలో కాపు ,రెండ్లు కలిస్తే చంద్రబాబు గెలుపుని అడ్డుకోవడం పెద్ద విషయం కాదనేది ఇప్పటికే బీజేపి అధిష్టానం అంచనా వేస్తోంది..కానీ జగన్ – పవన్ కలవడం సాద్యమా..? అంటే సాధ్యమనే చెప్పాలి ఎందుకంటే ఇద్దరూ ఇప్పుడు బీజేపి కోటలోనే ఉన్నారు బీజీపి మాట కాదనే సాహసం కూడా చేయరు అంటే టాక్ వినిపిస్తోంది..అంతేకాదు ఉత్తరాదిలో బీజేపీకి ఈ సారి పార్లమెంట్ సీట్లు తగ్గే అవకాశం ఉంది అందుకే పవన్ జగన్ లని కలిఫై ఏపీ నుంచీ ఆ లోటుని భర్తీ చేయాలనీ షా ప్లాన్ వేశారట.

అందులో భాగంగానే షా నేతృత్వంలో ఈ మధ్యకాలంలో ఇరు పార్టీలోని కీలక నేతల సమావేశం కూడా ఈ మధ్యకాలంలో జరిగిందని తెలుస్తోంది..అయితే పార్టీలు ఎవరికీ వారు పోటీ చేసుకుని చివరిగా ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకోవాలని ఒక ఆలోచనకి వచ్చారట..అందుకే ఈ మధ్యకాలంలో జగన్ కూడా ఎవరితో పొత్తు ఉండదు అని ప్రకటన చేశారు..ఏది ఏమైనా చంద్రబాబు ని ఓడించడానికి బీజేపీ పేదలు భారీ వ్యుహాలనే రచిస్తున్నారు అయితే ఎవరు ఎన్ని వ్యూహాలు రచించినా సరే విజయం మాత్రం మాకే సొంతం అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు.

,