జగన్ కి “ఆ ఎమ్మెల్యేలు” ఘలక్ ఇవ్వనున్నారా..       2018-04-26   05:00:16  IST  Bhanu C

జగన్ పై మొదట్లో ఉన్న నమ్మకం ఇప్పుడు పోతోంది..ఈ సారి వైసీపి అధికారంలోకి వస్తుందా లేదా..? ఒక వేళ అధికారంలోకి వస్తే జగన్ మనల్ని పట్టించుకుంటాడా ఇలాంటి సందేహాలు ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటపడుతున్నాయి అయితే ఈ సందేహాలు వచ్చింది ఎవరికో కాదు వైసీపి ఎమ్మెల్యేలకే..అదేంటి అనుకుంటున్నారా అయితే పూర్తిగా కధనం చదవండి..

వైసీపిలో నుంచీ ఇప్పటి టీడీపీ లోకి సుమారు 20 మందికి పైగానే వెళ్ళిన విషయం విదితమే అయితే ఇంకా వైసీపిలో ఉన్న చాలా మందికి అవకాశం కుదరక కొంతమంది ,జగన్ ఈ సారి ముఖ్యమంత్రి అయిపోతాడు అని కొంతమంది..అభిమానంతో మరికొంతమంది ఉండిపోయారు..అయితే ఇప్పుడు మిగిలిన సుమారు 40 లో సగానికి పైగానే జగన్ మీద తమ అసంతృప్తిని చూపిస్తున్నారట..ఎందుకు అంటే దానికి రీజన్ లేకపోలేదు..అదేంటంటే..

త‌మ‌కు తెలియ‌కుండానే త‌మ త‌మ నియోజ‌వ‌క‌ర్గాల్లోనిటీడీపీ అసంతృప్తుల‌ను పార్టీలోకి చేర్చుకొవ‌డం…ఒక కారణం అయితే రెండో కారణం మాత్రం నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ‌పై పెత్త‌నం ఎక్కువ కావ‌డం..ఇక మూడవ కారణం ఏమిటంటే ప్ర‌త్యేక హోదా కోసం ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయిస్తాన‌ని చెప్ప‌డం..మొదటి కారణాలతోనే ఎమ్మెల్యేలు జగన్ పై శివాలెత్తి పోతుంటే చివరి అంశంతో ఒక్కొక్కరు కారాలు మిరియాలు నూరుతున్నారట..ప్రత్యేక హోదా కోసం జగన్ తన ఎంపీ లతో రాజీనామాలు చేయించాడు ఇక‌, ఇప్పుడు త‌న వంతు అన్న‌ట్టుగా ఎమ్మెల్యేల‌తోనూ రాజీనామాలు చేయి స్తున్నారు. ఈ క్ర‌మంలోనే రెండు రోజుల క్రితం జగన్‌ పాదయాత్రలో ముఖ్య నేతలతో సమావేశమై సరైన సమయంలో ఎప్పుడైనా ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఢిల్లీ స్థాయిలో హోదా పోరు ఉధృతం చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

అయితే మరో ఏడాదిలో ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉన్న నేపధ్యంలో ఉన్న ఎమ్మెల్యే పదవిని వదులుకుంటే అప్పటి వరకు ప్రజలు గుర్తు పెట్టుకోరు అన్న సందేహాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి…ఇప్పటికే ఎమ్మెల్యేలు గా ఉండి తమ ప్రజలకి ఏమీ చేయలేకపోతున్నాము అని భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా రాజీనామాలు చేయమంటే ఎలా అంటూ తెగ టెన్షన్ పడుతున్నారట..మరో పక్క అసలు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తాడో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది..వచ్చిన వారిని వచ్చినట్టు పార్టీలో చేర్చుకుంటే మనకి టిక్కెట్లు రావడం కష్టం అనుకున్న ఎమ్మెల్యేలు జగన్ చెప్పినప్పుడు రాజీనామా చేసిన జగన్ కి మైలేజ్ తెచ్చే దానికంటే కూడా స్వచ్చందాగానే రాజీనమలు చేసి టీడీపిలోకి వెళ్ళడం బెటర్ అనే ఉద్దేశ్యంలో ఉన్నారట. అయితే ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ మొత్తానికి కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం త్వరలో జగన కి బిగ్ షాక్ ఇవ్వనున్నారట