జగన్ ఎమ్మెల్యే లకు పీకే టెన్షన్ ? రిపోర్ట్ ఏంటంటే ?

నేరుగా వైసీపీకి రాజకీయ సలహాలు అందించక పోయినా, తన టీమ్ ద్వారా ఆ లోటును తీరుస్తున్న వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బలం గురించి అందరి కంటే ఆ పార్టీ అధినేత జగన్ కు బాగా తెలుసు.ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు నూటికి నూరు శాతం సక్సెస్ అవుతాయని జగన్ బాగా నమ్ముతారు.

 Ysrcp Mlas Tention On Prasanth Kishore Team Sarve Report-TeluguStop.com

ఇప్పటికే వైసీపీ ని 2019లో అధికారంలోకి తీసుకురావడంలో పీకే శక్తి సామర్థ్యాలు బాగా పనిచేసాయి.టీడీపీ కంచుకోటలకు కూడా బీటలు పడ్డాయి.

జగన్ కు తిరుగులేని అధికారాన్ని దక్కేలా చేశాయి.అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కాస్తోకూస్తో ప్రజల వ్యతిరేకత ఎదుర్కొంటోంది.

 Ysrcp Mlas Tention On Prasanth Kishore Team Sarve Report-జగన్ ఎమ్మెల్యే లకు పీకే టెన్షన్ రిపోర్ట్ ఏంటంటే -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జగన్ కు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.దీంతో ప్రశాంత్ కిషోర్ టీమ్ ను రంగంలోకి దించారు .ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతం తో పాటు, కొన్ని కీలకమైన ప్రాంతాల్లో పార్టీ పరిస్థితులపై, ప్రస్తుత రాజకీయ వాతావరణం ఎలా ఉంది అని విషయంపైన, వైసీపీ విషయంలో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే పనిలో పీకే టీమ్ నిమగ్నమైంది.

ఇప్పుడు ఈ సర్వేల పైన వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

ప్రశాంత్ కిషోర్ టీం పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ కోసం పనిచేశారు.ఆ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలోనూ ఈ టీం సర్వే నిర్వహించింది.

ఆ సర్వే ఆధారంగా దాదాపు 35 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు.ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం పై ప్రజల్లో కొన్ని కొన్ని విషయాల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.

దీంతో పాటు కొంత మంది ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి ప్రజలు నెలకొనడంతో వారిని జగన్ తప్పిస్తారు అని, రాబోయే ఎన్నికల్లో వారికి సీటు ఇచ్చే అవకాశం లేదు అనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది.ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి, నివేదికలు అందిస్తే ఖచ్చితంగా అటువంటి వారిని పక్కన పెట్టేస్తారు.

ఈ విధంగా దాదాపు 60 శాతం మంది ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో నిరాశ తప్పదని తెలుస్తోంది.

Telugu Ap Cm, Ap Cm Jagan, Jagan, Janasena, Janasena Tdp Alliance, Pavan Kalyan, Pk, Pk Team, Prasanth Kishore, Sarve, Tdp, Ycp Sitting Mlas, Ysrcp, Ysrcp Mlas Tention-Political

2019 ఎన్నికల్లో దాదాపు 300 మంది జగన్ ప్రభావంతోనే గెలిచారు.అలా గెలిచిన వారిలో చాలామంది ప్రజాధరణ సంపాదించలేకపోవడం, నియోజకవర్గంలో వారి ప్రభావం ఏమాత్రం కనిపించకపోవడం, ప్రజల్లో ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి పెరగడం వంటి కారణాలపై ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీమ్ ప్రాథమిక నివేదికను జగన్ కు అందించినట్లు సమాచారం.అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ, తరచుగా పార్టీ పరువును బజారున పడేస్తున్నారని, వీరి కారణంగా పార్టీకి లాభం లేకపోగా నష్టమే ఎక్కువ అనే నివేదికలు కూడా జగన్ కు అందాయట.

ఇంకా పూర్తిస్థాయిలో పీకే టీం ఏపీ సర్వే నిర్వహించబోతూ ఉండడంతో తమకు 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందా లేదా అని టెన్షన్ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో నెలకొంది.

#Pk Team #AP CM Jagan #Ycp Mlas #AP Cm #Janasena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు