జగన్ కీలక నిర్ణయం .. వైసీపీ ఎమ్మెల్యేలు హ్యాపీ ?

చాలా కాలంగా వైసీపీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి ఉంటుంది వస్తోంది.ఒకవైపు ఎన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్న,  నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలతోపాటు , గ్రూపు రాజకీయాలు ఇవన్నీ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారిపోయాయి.

 Ysrcp Mlas Happy On Jagan Desistion-TeluguStop.com

దేనిపైనా ప్రజలకు స్పష్టంగా హామీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.అసలు వైసిపి ఎమ్మెల్యేగా గెలిచాము అన్న పేరు తప్ప , జగన్ ను చాలా మంది ఎమ్మెల్యేలు కలవలేదు.

ఈ  విషయంలో తీవ్ర అసంతృప్తి ఉంది .అదీ కాకుండా జగన్ గెలిచిన దగ్గర నుంచి ఎక్కువగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి పరిమితమైపోవడం,  పర్యటనలు చేపట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు.
  అలాగే కరోనా వైరస్ ప్రభావం తదితర కారణాలతోనూ జగన్ క్యాంప్ కార్యాలయంను వదిలి బయటకు రావడం లేదు.దీనిపై సొంత పార్టీలోనే కాకుండా, ప్రతిపక్షాలు సైతం విమర్శలు చేస్తున్నారు.

 Ysrcp Mlas Happy On Jagan Desistion-జగన్ కీలక నిర్ణయం.. వైసీపీ ఎమ్మెల్యేలు హ్యాపీ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయినా జగన్ మాత్రం తన పంథా ను మార్చుకోవడం లేదు.దీంతో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో సమస్యలను మంత్రులు జిల్లా ఇన్చార్జి మంత్రుల వద్ద ప్రస్తావించి కాస్తోకూస్తో పనులు చక్కబెట్టుకుంటున్నారు.

అయితే ఇక పై ఆ బాధ లేకుండా జగన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారట.క్షేత్రస్థాయి లో పర్యటనలు చేపట్టాలని , ప్రజా సమస్యలను స్వయంగా ప్రజల్లోకి వెళ్లి తెలుసుకోవడంతో పాటు, పార్టీలో నెలకొన్న గ్రూప్ రాజకీయాలపైనా దృష్టి సారించాలని, అంతకంటే ముందు గానే ఎమ్మెల్యేలతో మాట్లాడాలని జగన్ నిర్ణయం తీసుకున్నారట.

ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల తోనూ జగన్ చర్చించినట్లు సమాచారం.
 

Telugu Ap Cm, Ap Politics, Cbn, Chandrababu, Constituency Problems, Jagan, Jangan Contacting Mlas, Tdp, Ycp Mla, Ysrcp, Ysrcp Ministers, Ysrcp Mlas, Ysrcp Mlas Happy-Telugu Political News

ఈ సందర్భంగా పార్టీలో నెలకొన్న పరిస్థితులను,  నియోజకవర్గాల వారీగా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ? ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు  నియోజకవర్గంలో ఏ విధంగా అమలు అవుతున్నాయి .ప్రజల నుంచి ఏ విధమైన రెస్పాన్స్ వస్తోంది ? రాబోయే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి.తదితర అంశాలు ఎన్నో జగన్ ఎమ్మెల్యే నుంచి అడిగి తెలుసుకన్నారట.

అలాగే నియోజకవర్గంలో  నెలకొన్న గ్రూపు రాజకీయాలను ఒక్కో ఎమ్మెల్యే నుంచి అడిగి తెలుసుకుని వారికి తగిన సూచనలు చేస్తున్నట్లు సమాచారం.జగన్ నియోజకవర్గాల వారీగా పర్యటనలను చేపడితే వైసీపీలో మరింత జోష్ పెరగడం ఖాయం.

#YSRCP MLAs #YSRCP Ministers #AP Cm #Chandrababu #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube