పాపం వైసీపీ ఎమ్మెల్యే లు !  ఎవరికీ చెప్పుకోలేని బాధ ? 

ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రస్తుతం నడుస్తోంది 151 మంది ఎమ్మెల్యేలు, మరి కొంతమంది టిడిపి , జనసేన ఎమ్మెల్యేల బలం ఉండడంతో వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అన్నట్లుగా ఉంది.దీనికి తోడు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ,  నిరంతరంగా వాటిని అమలు చేస్తున్న తీరు  , రామన్న రోజుల్లోనూ వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు లేకపోవడం తదితర కారణాల తో ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అసంతృప్తి లోనే ఉంటున్నారు.

 Ysrcp, Ap Cm Jagan, Tdp, Ysrcp Mla's, Kolagatla Veerabadra Swamy, Ap Welfare Sch-TeluguStop.com

అయితే వైసిపి ఎమ్మెల్యేలు బాధ మాత్రం మరోలా ఉంది.ఎమ్మెల్యేలుగా తాము గెలిచిన తమ ద్వారా ఏ పనులు కావడం లేదని,  పూర్తిగా అధికారులపైనే పరిపాలన కొనసాగుతోందని,  తాము జనాల్లోకి వెళ్ళలేక , జనాలు తమకు ఉన్న వివిధ సమస్యలను పరిష్కరించాల్సిందిగా  ఎమ్మెల్యేలను కోరుతున్న అధికారులు మాత్రం ఎమ్మెల్యేలు మాట వినడం లేదట.

  ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయట.

పార్టీ కేడర్ కూడా వివిధ అంశాలలో మేలు చేయాల్సిందిగా ఎమ్మెల్యేలను కోరుతున్న,  ఎమ్మెల్యేలు , అధికారులకు ఈ విషయమై సిఫార్సు చేస్తున్నా, అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం, తదితర కారణాలతో వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, తమకు ఏ విషయాలను ప్రాధాన్యం దక్కడం లేదని పూర్తిగా అధికారుల చేతిలోనే అన్ని పెడుతున్నారని, ఇలా అయితే తమను ఎవరు పట్టించుకుంటారు అని,  ఇలా అయితే రాబోయే ఎన్నికల్లో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి అనే విషయం పై తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారట.2019 ఎన్నికల్లో గెలిచేందుకు కోట్లాది రూపాయలు అప్పులు చేశామని,  ఇప్పుడు ఆ అప్పులు తీరే మార్గం కూడా లేకుండా పోయిందని, ఏ విషయంలోనూ ఎమ్మెల్యే లకు ప్రాధాన్యత లేకుండా అన్ని వ్యవహారాలు అధికారుల ద్వారా జగన్ చక్కబెడుతున్నారు అనే తీవ్ర అసంతృప్తికి గురవు తున్నారు అట.

Telugu Ap Cm Jagan, Ysrcp, Ysrcp Mlas-Telugu Political News

అయితే వ్యవహారాలపై పార్టీ సీనియర్లు, ఇంచార్జీ మంత్రుల వద్ద ప్రస్తావించడం తప్పించి,  బహిరంగంగా ఈ వ్యవహారంపై స్పందించే పరిస్థితి ఏర్పడింది.ఇటీవల ఈ వ్యవహారంపై విజయనగరం వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రజల్లో తమను విలన్లను చేస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈయనే కాదు మిగతా ఎమ్మెల్యేలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube