వైసీపీ ప్రజాప్రతినిధులని భయపెడుతున్న కరోనా… మరో ఎమ్మెల్యేకి  

ysrcp mla kilari rosaiah tested corona positive, AP Politics, YSRCP, Corona Effect, COVID-19, Corona Virus - Telugu Ap Politics, Corona Effect, Corona Virus, Covid-19, Ysrcp, Ysrcp Mla Kilari Rosaiah Tested Corona Positive

తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి.కరోనా బారిన పడే వారిలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఉన్నారు.

 Ysrcp Mla Kilari Rosaiah Tested Corona Positive

లాక్ డౌన్ సడలింపుల వలన ఈ కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.కరోనా బారిన పడుతున్న వారిలో ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు.

ప్రజల మధ్య ఎక్కువగా తిరుగుతూ ఉండటం వలన వీరు కరోనా బారిన పడుతున్నట్లు తెలుస్తుంది.తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా కరోనా బారిన పడుతూ ఉన్నారు.

వైసీపీ ప్రజాప్రతినిధులని భయపెడుతున్న కరోనా… మరో ఎమ్మెల్యేకి-General-Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వ విప్ ఒంగిడి సునీత కరోనా బారిన పడ్డారు.

ఇదిలా ఉంటే ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలో వరుసగా కరోనా బారిన పడుతున్నారు.

ముందుగా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కరోనా బారిన పడగా అతను హోం క్వారంటైన్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.రాయలసీమకి చెందిన ఒక ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు.

తాజాగా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

తనకి కరోనా సోకినా కూడా ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని, ఈ విషయం తెలిసిన వెంటనే తాను హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయినట్లు తెలిపారు.అయితే జగన్ వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టరేట్ కి వెళ్ళినప్పుడు ఇతనికి కరోనా అని బయటపడిందని తెలిపారు.

ఈ నేపధ్యంలో ఎమ్మెల్యేతో కాంటాక్ట్ ఉన్న అందరిని గుర్తించి హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.ఈ వరుసలో ఇంకెంత మంది ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడతారో అనే టెన్షన్ ఇప్పుడు ఏపీలో ఉంది.

#AP Politics #Corona Effect #COVID-19 #Ysrcp #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ysrcp Mla Kilari Rosaiah Tested Corona Positive Related Telugu News,Photos/Pics,Images..