ఔరా..ఎం.ఎల్.ఏ.. ఇరగదీసాడు!!

సాధారణంగా అస్సెంబ్లీ అంటే విమర్శలు, ప్రతి విమర్శలు అంటూ ఒక బ్యాడ్ టాక్ ప్రజల్లో ఉంది.అయితే దానికి నిదర్శనంగానే సభలో ప్రజా సమస్యలపై చర్చించడం మానేసి నేతలంతా ఒకరి పై మరొకరు, ప్రతి పక్షం పై పాలక పక్షం, అదేవిధంగా పాలక పక్షంపై ప్రతి పక్షం విరుచుకుపడుతూనే ఉంటాయి.

 Ysrcp Don Mla Outstanding Speech-TeluguStop.com

ఇక స్పీకర్ సైతం సభకు పెద్దగా వ్యవహరించినప్పటికీ ప్రభుత్వానికి మద్దతుగానే మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.మరో పక్క విపక్షాల నేతలకు సమయం సైతం తక్కువగా ప్రకటించడం, లేదా ఆ ప్రకటించిన సమయంలో విప్కక్ష నేత మాట్లాడుతుంటే మైక్ కట్ చేసేయ్యడం షరా మామూలే.

కానీ ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్ర అస్సెంబ్లీ సమావేశాల్లో ఒక ఎం.ఎల్.ఏ మాట్లాడిన తీరు అందరినీ కట్టి పడేసింది.ఆయన ఎవరో కాదు ప్రతిపక్ష పార్టీకి చెందిన డోన్ ఎం.ఎల్.ఏ బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి.ఆయన రాజధానిపై, ఆ బిల్లులో ఉన్న లోపాలపై ఒక్కో పాయంట్ ను వివరిస్తూ మాట్లాడిన తీరు చూస్తే పాలక పక్షం సైతం నివ్వెర పోయినట్లుగా కనిపించింది.అక్కడక్కడా సామెతలు, చిన్న చిన్న కొటేషన్స్ చెబుతూ తడుముకోకుండా మాట్లాడిన నేత చివర్లో వ్యాట్ బిల్లును సభలో ప్రవేశపెట్టిన సమయంలోనూ దానిలో లోపాలు ఎత్తి చూపారు.

మరి పార్టీ ఏదైనా.పాలక పక్షమైనా, ప్రతి పక్షమైనా ప్రజా సమస్యలపై ఇలా మాట్లాడగలిగే నాయకులే ప్రజలు కోరుకునేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube