ఎమ్మెల్సీ లే టార్గెట్ గా రంగంలోకి దిగిన మంత్రులు

మూడు రాజధానుల అంశంలో ముందుకు, వెనక్కి వెళ్ళ లేక మధ్యలోనే ఆగిపోయింది వైసీపీ ప్రభుత్వం.అయితే తాము అనుకున్నది నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది.

 Ysrcp Ministers Targets Tdp Mlcs-TeluguStop.com

శాసనసభలో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు సంబంధించిన బిల్లును విజయవంతంగా ఆమోదించుకున్న జగన్ ప్రభుత్వం, శాసనమండలిలో మాత్రం తమకు బలం లేకపోవడంతో ఆ బిల్లు సెలెక్ట్ కమిటీకి టిడిపి వ్యూహాత్మకంగా పంపించేలా చేసింది.అప్పటి నుంచి శాసన మండలి పై ఆగ్రహంగా ఉన్న జగన్ మండలిని రద్దు చేస్తారని దీనికోసం ఆర్డినెన్సు తీసుకురాబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.

తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలపై వైసిపి గురి పెట్టింది.

శాసనమండలిలో మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఆయనను పదవి నుంచి దించి చేయడమే తమ లక్ష్యంగా పావులు కదుపుతోంది.

అందుకే శాసనమండలిలో బిల్లు వెనక్కి తెప్పించాలని చూస్తోంది.ఆ బిల్లును శాసన మండలిలో ఆమోదించడం లేక శాసనసభకు పంపించడం చేస్తే తమ పని అయిపోతుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది.

ఆదివారం సాయంత్రం లోగా దీనికి సంబంధించి ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని వైసిపి భావిస్తోంది.ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్సీలు ఫోన్లో తమతో టచ్ లో ఉన్నారని, ఐదుగురి ఎమ్మెల్సీలకు ఫోన్లు చేసి ఇద్దరు మంత్రులు వారి పై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నట్టు టిడిపి ఆరోపిస్తోంది.

Telugu Aplegislative, Chandrababu, Tdp Mlcs, Ysrcp Ministers-Telugu Political Ne

అలాగే ఇద్దరు ఎమ్మెల్సీలపై ఉన్న పాత కేసులను కూడా తిరిగి తోడి ఇబ్బంది పెడతామని హెచ్చరికలు కూడా వైసిపి నాయకులు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.అయితే భారీ మొత్తంలో ఇచ్చేందుకు కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇదే విషయమై టిడిపి చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది.ఈ నేపథ్యంలో శాసనసభపక్ష సమావేశం ఆదివారం చంద్రబాబు అధ్యక్షతన పార్టీ జాతీయ కార్యాలయంలో జరగబోతోంది.

ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించారు.తెలుగుదేశం ఎమ్మెల్సీలకు అధికార పార్టీ నేతలు ఆఫర్లు ఇచ్చినా వాటిని తిప్పికొట్టాలని, ఎవరూ వైసీపీ వెళ్లవద్దని, పార్టీ ఎప్పుడు భరోసాగా ఉంటుందని వారికి నచ్చ చెప్పే ప్రయత్నం ఈ సమావేశంలో చేయబోతున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube