అవినీతి చక్రవర్తి : పుస్తకం విడుదల చేసిన వైసీపీ !     2019-01-09   18:11:28  IST  Sai Mallula

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశాన్ని… ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మీద రాజకీయ కక్ష తీర్చుకునే పనిలో పడింది వైసీపీ.తెలుదేశం పార్టీని చులకన చేసి లబ్ది పొందేందుకు ప్రస్తుతం వైసీపీ అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ” నిన్ను నమ్మం బాబూ అంటూ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసిన వైసీపీ తాజగా అవినీతి చక్రవర్తి పేరుతో పుస్తకాన్ని విడుదల చేసింది.

Ysrcp Leaders Released A Book At Delhi-

Ysrcp Leaders Released A Book At Delhi

ప్రజాస్వామ్య పరిరక్షణ ముసుగులో ప్రతిపక్ష పార్టీలతో కూటమి ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్న అవినీతి చక్రవర్తి అయిన చంద్రబాబు నిజస్వరూపాన్ని జాతీయ స్థాయిలో ఎండగడతామని వారు చెబుతున్నారు. ఈ పుస్తకాన్ని తెలుగు,ఆంగ్లంలో తయారు చేశారు. ఆంగ్ల పుస్తకాన్ని మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు మంగళవారం ఢిల్లీలో విడుదల చేశారు.బాబు అవినీతిని జాతీయ స్థాయి నేతలకు, ఎంపీలకు తెలియజెప్పేలా ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని ఇస్తామని, అలాగే దర్యాప్తు సంస్థలకు అందజేసి విచారణ కోరతామన్నారు.