బీజేపీ పై వైసీపీ ఎందుకిలా ? ‘ ఓవర్ ‘ అయ్యిందే ?  

ysrcp leaders quation on jagan decisions about bjp friendship Jagan ,modhi ,prime minister ,ysrcp ,bjp,YSRCP Leaders, Polavaram, Amaravathi, GST Pending Casess - Telugu Amaravathi, Bjp, Gst Pending Casess, Jagan, Modhi, Polavaram, Prime Minister, Ysrcp, Ysrcp Leaders

ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రంలో బీజేపీకి ఏపీ అధికార పార్టీ వైసీపీ మద్దతు ఇస్తోంది.బిల్లులు ఆమోదం తెలిపే విషయంలో కొన్ని పార్టీలు అభ్యంతరం చెబుతూ, ఓటింగ్ కు దూరంగా ఉన్నా, వైసీపీ ఎంపీలు మాత్రం బీజేపీకి అన్ని రకాలుగాను మద్దతిస్తున్నారు.

TeluguStop.com - Ysrcp Leaders Quation On Jagan Decisions About Bjp Friendship

కేంద్రం తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలకూ అంతే స్థాయిలో మద్దతు పలుకుతున్నారు.కానీ వైసీపీ విషయంలో బీజేపీ దాగుడుమూతలు ఆడుతోంది .కేంద్రంలో అప్పుడప్పుడు వైసీపీకి సహకరిస్తున్నట్లు గా కనిపించినా, ఏపీలో మాత్రం పూర్తిగా రాజకీయ బద్ధశత్రువు గానే చూస్తున్నారు.ఏపీకి సంబంధించిన పోలవరం ప్రాజెక్టు, పెండింగ్ నిధులు, జీఎస్టీ బకాయిలు, ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో అంశాలలో వైసీపీ ప్రభుత్వం ఎంతగా ఒత్తిడి చేస్తున్నా, కేంద్రం మాత్రం స్పందించడం లేదు.

సరైన సహకారం ఇవ్వడం లేదు.

TeluguStop.com - బీజేపీ పై వైసీపీ ఎందుకిలా ఓవర్ అయ్యిందే -Political-Telugu Tollywood Photo Image

కేంద్ర బీజేపీ పెద్దల తీరు ఆ విధంగా ఉన్నా, అవేమీ పట్టించుకోనట్టుగానే జగన్ వారికి మద్దతు ఇస్తూ వస్తున్నారు.అడిగినా, అడగకపోయినా వెళ్లి మరీ మద్దతు పలుకుతున్నారు.బీజేపీ రాజకీయ ప్రత్యర్థుల పైన వైసీపీ ఎంపీలు విమర్శలు చేస్తూ బీజేపీకి దగ్గరయ్యేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏపీ విషయంలో కానీ, వైసీపీ విషయంలో కాని, కేంద్ర రాష్ట్ర బీజేపీ నాయకులు ఎవరు సహకరించకపోయినా, అనవసరంగా ఎందుకు వారి వెంట పడాల్సి వస్తుందనే అభిప్రాయం అందరిలోనూ తలెత్తుతోంది.బీజేపీ తరచుగా అవమానాలకు గురి చేస్తున్నా, పట్టించుకోనట్టు వ్యవహరిస్తుండడం వైసీపీ నాయకులకు మింగుడుపడటంలేదు.

అయితే జగన్ అసలు ఎందుకు ఇంతగా బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారు అనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.అయితే ఈ విషయంపై ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిసినా జగన్ పట్టించుకోనట్టు గానే వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి .

ఇప్పుడు కాకపోతే కాస్త ఆలస్యంగానైనా ఏపీ కి సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ, కేంద్రం సహకరిస్తుందని, ప్రస్తుతం ఏపీలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల నుంచి కాస్త ఉపశమనం పొందాలంటే, కేంద్రం నుంచి నిధులు భారీగా రావాలని, ఇవన్నీ జరగాలంటే కేంద్రంతో సఖ్యత గా ఉండాల్సిందే అనే అభిప్రాయం లో జగన్ ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.

#Amaravathi #Modhi #YSRCP Leaders #Polavaram #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ysrcp Leaders Quation On Jagan Decisions About Bjp Friendship Related Telugu News,Photos/Pics,Images..