అప్పుడు విజయసాయి... ఇప్పుడు సజ్జల ! అదే అసంతృప్తి ?

మొన్నటి వరకు వైసీపీలో ఏ వ్యవహారాలు జరగాలన్నా జగన్ ను ఎవరు కలవాలన్నా, ఏ నేతకు ఏ పదవి రావాలన్నా అంతా విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే జరిగేది.మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు గా , ఆడిటర్ గా విజయ్ సాయి తో జగన్ కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

 Sajjala Rama Krishna Reddy Disappointed With Ycp, Sajjala Ramakrishna Reddy, Ycp-TeluguStop.com

అందుకే జగన్ అంతగా ఆయనకు ప్రాధాన్యం ఇచ్చేవారు.వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ విజయసాయి కీలకంగా వ్యవహరించారు.

అలాగే జగన్ అక్రమాస్తుల కేసులలోనూ విజయసాయి జైలుకు వెళ్లి వచ్చారు.ఆ విధంగానే జగన్ ఆయనకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు.

అయితే ఆయన కారణంగా పార్టీలో అసంతృప్తి పెరుగుతోందని, అనవసర గ్రూపు రాజకీయాలకు ఆయన కారణమవుతున్నారు అని, ఇలా రకరకాల కారణాలతో విజయసాయి ని ఉత్తరాంధ్ర ప్రాంతానికి మాత్రమే పరిమితం చేశారు.

ఆయన స్థానంలో ప్రభుత్వ సలహాదారు, తనకు అత్యంత సన్నిహితులైన సజ్జల రామకృష్ణ రెడ్డి కి మరింత ప్రాధాన్యం జగన్ పెంచారు.

పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఏ విషయం పైన సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే స్పందిస్తున్నారు.అన్ని శాఖలకు సంబంధించిన విషయాల పైన ఆయన సమాధానం చెబుతున్నారు.పార్టీ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం మాత్రం సజ్జలే తీసుకుంటారు అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది.ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే ఏ విధంగా మాట్లాడాలి ? ప్రతిపక్షాల విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలి ఇలా అన్ని విషయాలను సజ్జల చెప్పినట్లుగాను,  సూచించినట్లుగానే జరుగుతూ ఉన్నాయి.అయితే ఇప్పుడు సజ్జల వ్యవహారంపై సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఆయన మితిమీరిన జోక్యం కారణంగా ఎంతో మంది నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో తేలుతోంది.

Telugu Ap Cm, Ap Cm Jagan, Ap Ministers, Chandrababu, Congress, Jagan, Sajjalara

అప్పట్లో విజయసాయిరెడ్డి ఏ విధంగా వ్యవహరించారో ఇప్పుడు అదే విధంగా వ్యవహరిస్తున్నారని,  ఆయన కారణంగా జగన్ పై అసంతృప్తి పెరుగుతుందని వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా కడప జిల్లాకు చెందిన మైదుకూరు మాజీ ఎమ్మెల్యే డిఎల్ రవీంద్రారెడ్డి సైతం సజ్జల ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు.  ఏపీలో ముఖ్యమంత్రి, మంత్రులు ఇలా ఎంతోమంది ఉన్నా, అన్ని విషయాల పైన సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ ఆయన ప్రశ్నించారు.పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎలా ఎవరైనా జగన్ తో నేరుగా మాట్లాడే అవకాశం లేదట.

ఏ విషయాన్నైనా సజ్జలకు చెప్పిన తర్వాతే ఆయన నిర్ణయం మేరకు జగన్ దగ్గరకు వెళ్లడం,  లేదా సజ్జల పరిష్కరించడం వంటివి చోటు చేసుకుంటున్నాయట.సర్దార్ వ్యవహారం పైన ఇప్పుడు వైసీపీ లో పెద్ద హాట్ టాపిక్ నడుస్తోంది.

సజ్జల ఒంటెద్దు పోకడలకు పాల్పడుతున్నారని, అన్ని విషయాలను ఆయన జోక్యం చేసుకుంటూ తమకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని అసంతృప్తి వైసీపీ నేతలు రోజురోజుకు పెరుగుతోంది అప్పట్లో విజయసాయిరెడ్డి వ్యవహారంపై వైసిపి నేతలు ఏ విధమైన అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు అదే రకమైన అసంతృప్తితో సజ్జల విషయంలోనూ ఉండడంతో జగన్ ఈ వ్యవహారం పై చాలా సీరియస్ గానే ఉన్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube