ఉండలేరు వెళ్లలేరు ! వైసీపీ లో వీరి బాధ ఇంతింతకాదయా ?

ఏపీలో అధికార పార్టీ గా బలం ,బలగం ఉన్న పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది.ప్రస్తుతం ఆ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.

 Ysrcp Leaders Not Satisfied On Jagan Behaviour-TeluguStop.com

ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సైతం, పూర్తిగా బలహీన కావడం, రానున్న రోజుల్లో ఆ పార్టీ ఉనికి కోల్పోయే అంత స్థాయిలో పార్టీలో పరిస్థితులు ఏర్పడ్డాయి.బిజెపి, జనసేన ప్రభావం అంతంత మాత్రంగా ఉండడంతో, వైసిపికి రానున్న కాలంలోనూ ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం కనిపించడం లేదు .ఇంతవరకు వైసిపి కి ఏ ఇబ్బందీ లేకపోయినా, సొంత పార్టీ లో మాత్రం చాలా కాలం నుంచి అసంతృప్తులు పెరిగిపోతున్నాయి.పార్టీ కోసం, పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తాము ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొని మరీ కష్టపడ్డామని,  అయినా, పార్టీ తమను ఏమాత్రం పట్టించుకోకుండా, తమకు పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వకుండా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి,  మొదటినుంచి కష్టపడకుండా పార్టీ కేవలం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే యక్టివ్ ఆయన నేతలకు కీలక పదవులు దక్కుతున్న  వ్యవహారాలపై, చాలామంది అసంతృప్తితో ఉన్నారట.

పార్టీ ఆదేశాల మేరకు కొంత మంది నాయకులు ఎమ్మెల్యే సీటు  సైతం త్యాగం చేయగా , వారిలో కొంతమందికి మాత్రమే పార్టీ గుర్తింపు ఇవ్వడం,  మిగిలిన విషయాల్లో  పెద్దగా పట్టించుకోనట్లు వ్యవహరించడం,  ఇలా ఎన్నో అంశాలతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కేడర్ అధినేత తీరుపై అసంతృప్తితో ఉన్నారట.తమకు కీలకమైన పదవులు దక్కలేదు అనే అసంతృప్తి కంటే,  కొత్తగా పార్టీలో కి వచ్చినవారికి కీలకమైన పదవులు ఇచ్చి, తమ కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం పై పార్టీ క్యాడర్ అసంతృప్తితో రగిలిపోతున్నారట.

 Ysrcp Leaders Not Satisfied On Jagan Behaviour-ఉండలేరు వెళ్లలేరు వైసీపీ లో వీరి బాధ ఇంతింతకాదయా -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎప్పటికప్పుడు పార్టీ సీనియర్ నాయకులు సర్దిి చెబుతూ వస్తున్నారు తప్పప, తమకు ప్రాధాన్యం కల్పించడంలో మాత్రం పార్టీ అగ్ర నాయకులు ఎవరు దృష్టి పెట్టడం లేదని, సదరు అసంతృప్తి నాయకులు గుర్రుగా ఉన్నారట.

Telugu Ap Cm Jagan, Bjp, Chandrababu, Janasena, Nominatted Posts, Party, Pavan Kalyan, Tdp, Ysrcp-Telugu Political News

అసలు టిడిపిి, బిజెపి ,జనసేన పార్టీ లలో ఏదో ఒకటి బలంగా ఉండి ఉంటేే , ఈ పాటికి పెద్ద ఎత్తున వైసీపీ లోని అసంతృప్తి నాయకులు ఆ పార్టీలో చేరి పోయే వారినిి , కానీ ఆ అవకాశం లేకపోవడం,  ఈ మూడు పార్టీలు ఏపీలో బలం పుంజుకునే అవకాశాలు పెద్దగా లేకపోవడం,  బలమైన పార్టీీ గా  వైసీపీ ఉండడంతో చేసేదిలేక సర్దుకుపోతూ వస్తున్నారట.

#Chandrababu #Pavan Kalyan #Party #AP CM Jagan #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు