వైసీపీ నేత‌లే టీడీపీకి బ‌ల‌మా... అక్క‌డ మార్పు మొద‌లైందే..!

తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌కీయాలు యూట‌ర్న్ తీసుకుంటున్నాయి.ముఖ్యంగా మ‌ద్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు, యూత్ కూడా ఇప్పుడు రాజ‌కీయాల్లో చైత‌న్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

 Ysrcp Leaders Are Plus For Tdp Leaders...changes Started In Ap Politics,rajamunr-TeluguStop.com

తాజాగా సోష‌ల్ మీడియాల్లో వ‌స్తున్న కామెంట్లు, పోస్టులు వంటివాటిని గ‌మ‌నిస్తే.ప్ర‌జ‌లు మైండ్ సెట్ అప్పుడే ఇంత‌గా మారిపోయిందా? అని అనిపిస్తోంది.తూర్పులో మొత్తంగా టీడీపీకి అనుకూల నియోజ‌క‌వ‌ర్గాలు చాలా ఉన్నాయి.2014లో ఈ పార్టీ బ‌లంగా ఇక్క‌డ త‌న స‌త్తా చాటింది.అయితే.గత ఏడాది ఎన్నిక‌ల్లో మాత్రం రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో (రాజ‌మండ్రి రూర‌ల్‌, సిటీ) త‌ప్ప‌.మిగిలిన అన్నిచోట్లా వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది.ఇది నిజంగా వైసీపీ సాధించిన రికార్డుగానే చెప్పాలి.

దీంతో ఇక్క‌డ వైసీపీ పునాదులు బ‌ల‌ప‌డ‌తాయి.ఇక‌, టీడీపీ క‌కావిక‌లం కావ‌డం ఖాయం అనుకున్నారు అంద‌రూ.దీనికి మ‌రోకార‌ణం కూడా ఉంది.యువ నాయ‌కుడు రాజ‌మండ్రి ఎంపీగా విజయం సాధించారు.

అదేస‌మ‌యంలో అమ‌లాపురం, కాకినాడ‌లు కూడా వైసీపీ హ‌స్త‌గ‌తం చేసుకుంది.దీంతో ఇక‌, వైసీపీకి తిరుగులేద‌ని అనుకున్నారు.

అతి పెద్ద జి‌ల్లాలో పాగా వేశాం.అందునా.

టీడీపీకి అనుకూల జిల్లాలో పాగా వేశాం అని వైసీపీ నాయ‌కులు కూడా సంబ‌రాలు చేసుకున్నారు.అయితే.

ఏడాదిన్న‌ర తిరిగేలోగా ప్ర‌జ‌ల‌కు వీరిపై మోజు త‌గ్గిపోయింది.ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌లు ఎందుకు వీరిని ఎన్నుకున్నామా? అనే కామెంట్లు పెడుతుండ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై చాలా మంది ఫైర్ అవుతున్నారు.పోల‌వ‌రం విష‌యంలోను, రాజ‌ధాని విష‌యంలోనూ ఇక్క‌డి ప్ర‌జ‌ల్లో స్ప‌ష్ట‌మైన విభ‌జ‌న క‌నిపిస్తోంది.కొందరు రాజ‌ధాని కావాల‌ని అంటే.మ‌రికొంద‌రు వ‌ద్ద‌ని అంటున్నారు.

అయితే ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.ఈ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌కంటే.

కూడా స్థానికంగా నేత‌ల వ్య‌వ‌హారం బాగా వ‌ర్కువుట్ అవుతుంది.ఈ క్ర‌మంలో చూసుకుంటే.

వైసీపీ నాయ‌కులు నిత్యం ఇక్క‌డ ర‌గ‌డ సృష్టిస్తున్నారు.ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

స్థానికంగా బ‌లంగా ఉన్న నాయ‌కులు కూడా రానురాను బ‌ల‌హీనులుగా త‌యారవుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

Telugu Ap, Chandra Babu, Mlas, Rajamunry, Tdp, Ysrcp, Ysrcptdp-Political

దీంతో వైసీపీ క‌న్నా టీడీపీనే బెట‌ర్ అంటున్నారు ప్ర‌జ‌లు.ఇది పార్టీకి పెను ఇబ్బందేన‌ని ప‌రిశీల‌కులు సైతం అంగీక‌రిస్తున్నారు. టీడీపీలో నేత‌లు ఇంత‌గా రోడ్డెక్కిన సంద‌ర్భాలు లేవ‌ని.

ఒక‌రిని ఒక‌రు దూషించుకోవ‌డం.రోడ్డుమీద ‌పడి కొట్టుకునే వ‌ర‌కు ప‌రిస్థితి రావ‌డం లేద‌ని అంటున్నారు.

ఏదేమైనా.బ‌ల‌మైన జిల్లాలో వైసీపీ ఇంత వేగంగా బ‌ల‌హీన‌ప‌డ‌డాన్ని వైసీపీ సానుభూతిప‌రులు జీర్ణించుకోలేక పోతున్నార‌న్న‌ది వాస్త‌వం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube